మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rajinikanth vs NTR: దసరాకి రజినీకాంత్ తో పోటీ పడనున్న ఎన్టీఆర్

ABN, Publish Date - Jun 03 , 2024 | 03:14 PM

రానున్న దసరా పండగకి గట్టి పోటీ ఉంటోంది. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా 'వేట్టయ్యాన్' అక్టోబర్ 10న విడుదలవుతోంది. అదే తేదీకి జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న 'దేవర' మొదటి భాగం కూడా విడుదలవుతోంది. దసరా పండగ ఎన్టీఆర్, రజినీకాంత్ మధ్య ఉంటుందని చర్చ నడుస్తోంది.

Rajinikanth Vs Jr NTR

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కి ప్రపంచం అంతటా లక్షల్లో అభిమానులు వున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అతని సినిమా విడుదలవుతోంది అంటే ఒక్క తమిళ ప్రేక్షకులే కాదు, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ ఇలా అన్ని భాషలు ప్రేక్షకులు ఎదురు చూస్తూ వుంటారు. ఇప్పుడు రజినీకాంత్ వరస సినిమాలతో చాలా బిజీగా వున్నారు. ముందుగా 'వెట్టయ్యాన్' సినిమా రజినీకాంత్ పూర్తి చేశారు. అతని పాత్ర చిత్రీకరణ పూర్తయింది, ఇంక మిగతా నటీనటుల పాత్రల చిత్రీకరణ కొంత వుంది అని చెపుతున్నారు.

ఈ సినిమాని దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 10న విడుదలవుతుందని అంటున్నారు. ఈ తేదీ ఖరారు అయిందని కూడా సామజిక మాధ్యమాల్లో పోస్టర్లు కూడా పెట్టారు. ఈ సినిమాకి టిజె జ్ఞానవేల్ దర్శకుడు, సుభాస్కరన్ నిర్మాత. ఈ సినిమాలో లెజండరీ నటుడు అమితాబ్ బచ్చన్ ఒక ప్రముఖ పాత్ర పోషిస్తుండగా, మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ లో ముఖ్య పాత్రల్లో కనపడనున్నారు. ఇంకో సినిమా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న 'కూలీ' చిత్రీకరణ జూన్ 10 నుండి ప్రారంభం అవుతుందని చెపుతున్నారు. ఇలా రజినీకాంత్ తన సినిమాల గురించిన వార్తలు అభిమానులకి క్లారిటీ ఇచ్చేసారు.

ఇదిలా ఉండగా, జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న 'దేవర' సినిమా కూడా అక్టోబర్ 10న విడుదలవుతుందని, ఆ చిత్ర నిర్వాహకులు ఇంతకుముందే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది ఎన్టీఆర్ కి చాలా ప్రతిష్టాత్మకమైన సినిమా అని చెప్పొచ్చు. అలాగే ఇది ఒక హై బడ్జెట్ సినిమా, రెండు భాగాలుగా వస్తోంది. మొదటి భాగం అక్టోబర్ 10న వస్తోంది. శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఇందులో కథానాయికగా నటిస్తోంది, కాగా హిందీ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు.

ఈ సినిమా చిత్రీకరణ కూడా శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమా ఇంతకు ముందే విడుదలవ్వాల్సి వున్నా, కొన్ని అనివార్య కారణాల వలన వాయిదా పడి, చివరికి అక్టోబర్ 10వ తేదీ ఖరారు చేశారు. ఈ సినిమా తెలుగులోనే కాకుండా, మిగతా భాషలు అన్నిటిలో విడుదలవుతోంది. రజినీకాంత్ సినిమా కూడా అక్టోబర్ 10న విడుదలవ్వటంతో, ఎన్టీఆర్ కి ఇప్పుడు గట్టి పోటీ వుండబోతోంది. ఎందుకంటే రజినీకాంత్ కి మిగతా భాషల్లో కూడా మంచి ప్రజాదరణ వుంది, అందుకని అక్కడ ఎన్టీఆర్ కి రజినీకాంత్ సినిమా పోటీ ఇవ్వడం ఖాయం. దసరా సెలవులు, పండగ సినిమాలకి చాలా ముఖ్యమైన రోజులు కాబట్టి ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.

Updated Date - Jun 03 , 2024 | 04:08 PM