గొప్ప సినిమాగా నిలిచిపోతుంది

ABN, Publish Date - Aug 05 , 2024 | 06:21 AM

‘‘తంగలాన్‌’ వందేళ్ల క్రితం జరిగిన కథ. అందమైన సాహసోపేత ప్రయాణం ఈ సినిమా. మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తాలని ఈ సినిమా గురించిన ముఖ్యమైన విషయాలేవి బయటకు...

‘‘తంగలాన్‌’ వందేళ్ల క్రితం జరిగిన కథ. అందమైన సాహసోపేత ప్రయాణం ఈ సినిమా. మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తాలని ఈ సినిమా గురించిన ముఖ్యమైన విషయాలేవి బయటకు చెప్పలేదు. నా కెరీర్‌లో అత్యుత్తమ పాత్రను ఈ సినిమాలో చేశాను’ అని హీరో విక్రమ్‌ అన్నారు. ఆయన కథానాయకుడిగా పా రంజిత్‌ రూపొందించిన చిత్రమిది. ఈ నెల 15న విడుదలవుతోంది. చిత్రబృందం ఆదివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. పా రంజిత్‌ మాట్లాడుతూ ‘మనదేశంలో అణచివేత, అసమానత్వం ఇంకా ఉన్నాయి. వీటిని ఎదుర్కొనేందుకు నేను సినిమాను మాధ్యమంగా ఎంచుకున్నాను. నా గత చిత్రాల్లానే ‘తంగలాన్‌’ను కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరించాలి’ అని కోరారు. తంగలాన్‌ ప్రచార చిత్రాల్లో మా కష్టం కనపడుతోంది అని నిర్మాత జ్ఞానవేల్‌ రాజా అన్నారు.

Updated Date - Aug 05 , 2024 | 06:21 AM