ఆ కళలో ఆరితేరలేదు

ABN, Publish Date - Aug 28 , 2024 | 02:32 AM

నా సినిమాలకు విస్తృత ప్రజాధరణ లభించేలా ప్రచారం చే సే కళలో నేను నిష్ణాతుణ్ణి కాను అని జాతీయ ఉత్తమ నటుడు, కన్నడ హీరో రిషబ్‌ శెట్టి అన్నారు. ఆయన స్వీయ నిర్మాణంలో...

నా సినిమాలకు విస్తృత ప్రజాధరణ లభించేలా ప్రచారం చే సే కళలో నేను నిష్ణాతుణ్ణి కాను అని జాతీయ ఉత్తమ నటుడు, కన్నడ హీరో రిషబ్‌ శెట్టి అన్నారు. ఆయన స్వీయ నిర్మాణంలో రూపొందిన చిత్రం ‘లాఫింగ్‌ బుద్ధ’. ఈ చిత్రం శాటిలైట్‌, ఓటీటీ బిజినెస్‌ పూర్తిగా నిరాశపరిచిందని ఆయన చెప్పారు. ‘లాఫింగ్‌ బుద్ధ’ ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సినిమా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ గురించి రిషబ్‌ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ ఆశాజనకంగా లేదు. పెద్ద సినిమాలకు సైతం ఈ విషయంలో ఇబ్బందులు తప్పడం లేదు, కొన్ని చేదు అనుభవాల దృష్ట్యా కన్నడ సినిమాలను కొనేందుకు ఓటీటీ వేదికలు ముందుకు రావడం లేదు. ‘లాఫింగ్‌ బుద్ధ’ చిత్రానికి ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జీరో’ అని ఆయన చెప్పారు.

Updated Date - Aug 28 , 2024 | 02:32 AM