శ్వాగ్‌ లాంటి సినిమా తీయడం కష్టం

ABN, Publish Date - Oct 03 , 2024 | 02:52 AM

‘రాజ రాజ చోర’ ఫేమ్‌ హసిత్‌ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు, రీతూ వర్మ నటించిన చిత్రం ‘శ్వాగ్‌’. టీ.జీ.విశ్వప్రసాద్‌ నిర్మించారు. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా చిత్ర బృందం ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించారు...

‘రాజ రాజ చోర’ ఫేమ్‌ హసిత్‌ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు, రీతూ వర్మ నటించిన చిత్రం ‘శ్వాగ్‌’. టీ.జీ.విశ్వప్రసాద్‌ నిర్మించారు. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా చిత్ర బృందం ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీవిష్ణు మాట్లాడుతూ ‘‘ఇది చాలా పెద్ద కథ. ఇలాంటి కథను తెరకెక్కించడం అంత ఈజీ ఏం కాదు. ఇందులో నాలుగు పాత్రలు పోషించాను. హసిత్‌ ఈ సినిమాను చాలా బాగా హ్యాండిల్‌ చేశారు’’ అని చెప్పారు. ‘‘గూఢచారి’, ‘బేబీ’ ‘కార్తీకేయ’ వంటి సినిమాల్లా.. మార్కెట్‌ కంటే ఎక్కువ స్పాన్‌ ఉన్న చిత్రం ‘శ్వాగ్‌’. కచ్చితంగా ఘనవిజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అని నిర్మాత టీ.జీ.విశ్వప్రసాద్‌ అన్నారు. ‘‘నిర్మాత విశ్వప్రసాద్‌ మేకింగ్‌ విషయంలో పూర్తి స్వేచ్ఛనిచ్చారు. శ్రీవిష్ణు కథను హీరోగా భావించే సినిమా చేసే గొప్ప నటుడు’’ అని డైరెక్టర్‌ హసిత్‌గోలి చెప్పారు. ‘‘ఇందులోని ప్రతీ పాత్ర కొత్తగా ఉంటుంది. సినిమా అందర్నీ ఆకట్టుకుంటుంది’’ అని హీరోయిన్‌ రీతూ వర్మ తెలిపారు.

Updated Date - Oct 03 , 2024 | 02:52 AM