కాలం కలిసొస్తే నడిచొచ్చే సినిమా

ABN, Publish Date - Aug 25 , 2024 | 04:56 AM

నాని హీరోగా నటించిన భారీ బడ్జెట్‌ చిత్రం ‘సరిపోదా శనివారం’ఈ నెల 29న విడుదల కానుంది. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో డీవీవీ దానయ్య, కల్యాణ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు...

నాని హీరోగా నటించిన భారీ బడ్జెట్‌ చిత్రం ‘సరిపోదా శనివారం’ఈ నెల 29న విడుదల కానుంది. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో డీవీవీ దానయ్య, కల్యాణ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో నాని మాట్లాడుతూ ‘ఈ సినిమా గురించి చాలా చెప్పేశాను. దర్శకుడు వివేక్‌ ఇందులో శివ తాండవం చూపించాడు. అతని కెరీర్‌కి ఈ సినిమా ఓ మైల్‌స్టోన్‌. మా కష్టాన్ని చూసి మీరు ఎంజాయ్‌ చేస్తారని భావిస్తున్నా. కాలం కలసి వస్తే నడిచి వచ్చే సినిమా వస్తుందంటారు. అటువంటి సినిమానే ‘సరిపోదా శనివారం’ అన్నారు. దర్శకుడు వివేక్‌ ఆత్రేయ మాట్లాడుతూ ‘మా దర్శకుల కుటుంబం అంతా ఈ వేడుకకి వచ్చి ఆశీస్సులు అందజేశారు. ఈ సినిమా 29న విడుదల చేయడానికి దర్శకుల టీమ్‌ కూడా ఓ కారణం. నాని నా మీద ఉంచిన నమ్మకానికి ‘సరిపోదా శనివారం’ ఇచ్చా’ అన్నారు. ‘ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అవుతుంది. నాని కథల ఎంపికలో బెస్ట్‌. కథ నచ్చితే కొత్త దర్శకుడైనా అవకాశం ఇస్తారు. ఆయనతో సినిమా చేస్తే నిర్మాతకు ఏ టెన్షన్‌ ఉండదు’ అన్నారు నిర్మాత దానయ్య. ఒక రకమైన యాక్షన్‌ ఫిల్మ్‌ను దర్శకుడు వివేక్‌ విభిన్నంగా మలిచారని ఎస్‌.జె.సూర్య ప్రశంసించారు.

Updated Date - Aug 25 , 2024 | 04:56 AM