Mahesh Babu : మహేశ్‌బాబు సినిమా అప్‌డేట్‌ అప్పుడేనా?

ABN, Publish Date - Jul 09 , 2024 | 02:28 AM

సోషల్‌ మీడియాలో నిరంతరం ట్రెండ్‌ అయ్యే విషయాల్లో దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి, మహేశ్‌బాబు సినిమా ఒకటి. ఈ సినిమా షూటింగ్‌ నుంచి ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని మహేశ్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు...

సోషల్‌ మీడియాలో నిరంతరం ట్రెండ్‌ అయ్యే విషయాల్లో దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి, మహేశ్‌బాబు సినిమా ఒకటి. ఈ సినిమా షూటింగ్‌ నుంచి ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని మహేశ్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం గురించి రకరకాలుగా చర్చించుకుంటున్నారు. సినిమా షూటింగ్‌ అప్పుడంటూ.. ఇప్పుడంటూ మొదలైన వార్తలు కొన్ని రోజులుగా ఆగిపోయాయి. కానీ ఇప్పుడు మహేశ్‌బాబు పుట్టినరోజు దగ్గరపడుతున్న తరుణంలో ఈ సినిమా షూటింగ్‌ అప్‌డేట్స్‌పై ఊహాగానాలు మళ్లీ మొదలయ్యాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను లేదా అనౌన్స్‌మెంట్‌ వీడియోను లేదా సినిమా నేపధ్యాన్ని పరిచయం చేసే గ్లింప్స్‌ అయినా మహేశ్‌ పుట్టినరోజున వదులుతారేమో అని నెట్టింట చర్చిస్తున్నారు. కాగా, మహేశ్‌ ఈ సినిమా కోసం తన లుక్‌ మార్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ఏ సినిమాలో కనిపించని విధంగా సరికొత్త లుక్‌లో పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.


ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యాక ్షన్‌ అడ్వెంచర్‌గా భారీ బడ్జెట్‌తో పాన్‌ వరల్డ్‌ మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కథను రచయిత విజయేంద్ర ప్రసాద్‌ అందిస్తున్నారు. పృథ్విరాజ్‌ సుకుమారన్‌ ఇందులో విలన్‌గా నటిస్తున్నారనే వార్త వినిపిస్తోంది. అలాగే బాహుబలి తర్వాత నాజర్‌ మళ్లీ రాజమౌళి దర్శకత్వం వహించే ఈ చిత్రంలో నటిస్తారని కూడా అంటున్నారు. ఇతర పాత్రలు పోషించే నటీనటుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలకు మహేశ్‌ పుట్టిన రోజైన ఆగస్టు 9న ఫుల్‌స్టాప్‌ పెట్టవచ్చని, ఆ రోజే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తారని అంతా ఎదురు చూస్తున్నారు.

Updated Date - Jul 09 , 2024 | 02:28 AM