ఏడడుగుల బంధంలోకి

ABN, Publish Date - Dec 13 , 2024 | 02:06 AM

ప్రముఖ నటి కీర్తి సురేష్‌ గురువారం ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టారు. తన స్నేహితుడు ఆంటోనీ తట్టిల్‌ను ఆమె పెళ్ళి చేసుకున్నారు. గురువారం గోవాలోని ప్రముఖ రిసార్టులో...

ప్రముఖ నటి కీర్తి సురేష్‌ గురువారం ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టారు. తన స్నేహితుడు ఆంటోనీ తట్టిల్‌ను ఆమె పెళ్ళి చేసుకున్నారు. గురువారం గోవాలోని ప్రముఖ రిసార్టులో వీరి వివాహం ఘనంగా జరిగింది. కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ పెళ్ళి వేడుకలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ పెళ్ళికి సంబంఽధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.


ఈ వివాహానికి కోలీవుడ్‌ నుంచి అగ్రహీరో విజయ్‌ తమిళ సంప్రదాయ పంచెకట్టులో హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కాగా, కీర్తి సురేష్‌ - ఆంటోనీలు గత 15 యేళ్ళుగా మంచి స్నేహితులుగా ఉన్నారు. కొచ్చిన్‌లో కాలేజీ చదువుకునే రోజుల నుంచే వీరిద్దరికి మంచి పరిచయముంది. వ్యాపార కుటుంబ నేపథ్యం కలిగిన ఆంటోనీకి చెన్నై, కొచ్చిన్‌లలో వ్యాపారాలు ఉన్నాయి.

చెన్నై(ఆంధ్రజ్యోతి)

Updated Date - Dec 13 , 2024 | 02:06 AM