మన సైన్యాన్ని అవమానిస్తారా?

ABN, Publish Date - Oct 28 , 2024 | 12:13 AM

శివకార్తికేయన్‌, సాయిపల్లవి జంటగా నటించిన దేశ భక్తి చిత్రం ‘అమరన్‌’ ఈ నెల 31న విడుదలకానుంది. మేజర్‌ ఉన్నిముకుందన్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. ఈ నేపథ్యంలో సాయిపల్లవి పాత వీడియోను వైరల్‌ చేస్తూ...

శివకార్తికేయన్‌, సాయిపల్లవి జంటగా నటించిన దేశ భక్తి చిత్రం ‘అమరన్‌’ ఈ నెల 31న విడుదలకానుంది. మేజర్‌ ఉన్నిముకుందన్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. ఈ నేపథ్యంలో సాయిపల్లవి పాత వీడియోను వైరల్‌ చేస్తూ నెటిజన్లు ఆమెను విమర్శిస్తున్నారు. ఆ వీడియోలో సాయిపల్లవి మాట్లాడుతూ ‘అసలు హింసకు సరైన నిర్వచనం ఏమిటో అర్థం కావడం లేదు. మనుషుల దృష్టికోణాన్ని బట్టే ఏదైనా ఉంటుంది. ఇండియన్‌ ఆర్మీ అంటే మనకు ఎంతో గౌరవం. కానీ పాకిస్థాన్‌ ప్రజలు మన సైనికులను ఉగ్రవాదుల్లా చూస్తారు. వాళ్లకు చేటు చేస్తామని అనుకుంటారు. దృక్పథాలు ఇలా మారిపోతుంటాయి’ అంటూ ఆమె మాట్లాడారు. ఈ వీడియో క్లిప్‌ను షేర్‌ చేస్తూ కొంతమంది ‘సాయిపల్లవి భారత సైనికులను తీవ్రవాదులు అనే అర్థం వచ్చేలా మాట్లాడార’ని ప్రచారం చేస్తున్నారు. సాయిపల్లవి భారత సైన్యం గురించి తప్పుగా మాట్లాడలేదు, ఇరు దేశాల ప్రజల దృక్పథాలను గురించి మాత్రమే ఆమె మాట్లాడారని మరికొందరు సమర్థిస్తున్నారు.

Updated Date - Oct 28 , 2024 | 12:13 AM