పోలీస్ పాత్రలో...
ABN, Publish Date - Oct 30 , 2024 | 05:45 AM
రాఘవ లారెన్స్, ఎల్విన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ ‘బుల్లెట్ బండి’. ఇన్నాసి పాండియన్ దర్శకత్వంలో కతిరేసన్ నిర్మిస్తున్నారు. రాఘవ లారెన్స్ పుట్టినరోజు సందర్భంగా...
రాఘవ లారెన్స్, ఎల్విన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ ‘బుల్లెట్ బండి’. ఇన్నాసి పాండియన్ దర్శకత్వంలో కతిరేసన్ నిర్మిస్తున్నారు. రాఘవ లారెన్స్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. సినిమా టైటిల్ ‘బుల్లెట్ బండి’. ఇందులో పోలీసాఫీసర్ పాత్రలో రాఘవ లారెన్స్ కనిపించనున్నారు. నటుడు సునీల్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎడిటర్: వడివేల్ విమల్‌రాజా, డీఓపీ: అరవింద్ సింగ్, సంగీతం: సామ్ సీఎస్.