క్లైమాక్స్‌లో...
ABN, Publish Date - Aug 05 , 2024 | 06:23 AM
చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతోన్న సోషియో-ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘విశ్వంభర’. ప్రస్తుతం హైదరాబాద్‌లో క్లైమాక్స్ చిత్రీకరణ జరుగు తున్నట్లు...
చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతోన్న సోషియో-ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘విశ్వంభర’. ప్రస్తుతం హైదరాబాద్‌లో క్లైమాక్స్ చిత్రీకరణ జరుగు తున్నట్లు యూనిట్ ఆదివారం ప్రకటించింది. ‘సినిమా మొత్తం ఒకెత్తు, క్లైమాక్స్ ఒక్కటి మరో ఎత్తు అనేలా ఉండబో తోంది, భారీ సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్‌తో దర్శకుడు వశిష్ఠ క్లైమాక్స్ సీక్వెన్స్‌ను దృశ్యకావ్యంలా తెరకెక్కిస్తున్నార’ని మేకర్స్ తెలిపారు. పతాక సన్నివేశాలకు ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ అనల్ అరసు నేతృత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 10న ‘విశ్వంభర’ ప్రేక్షకుల ముందు కొస్తోంది. విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. త్రిష హీరోయిన్.