ఆ విషయంలో నాన్న.. ముఫాసా ఒక్కటే!
ABN, Publish Date - Dec 18 , 2024 | 02:35 AM
‘ద లయన్ కింగ్’కు కొనసాగింపుగా తెరకెక్కిన సినిమా ‘ముఫాసా: ద లయన్ కింగ్’. ఇందులో టైటిల్ పాత్ర తెలుగు వెర్షన్‌కు మహేశ్‌బాబు వాయిస్ అందించిన విషయం తెలిసిందే. ఈ నెల 20న సినిమా...
‘ద లయన్ కింగ్’కు కొనసాగింపుగా తెరకెక్కిన సినిమా ‘ముఫాసా: ద లయన్ కింగ్’. ఇందులో టైటిల్ పాత్ర తెలుగు వెర్షన్‌కు మహేశ్‌బాబు వాయిస్ అందించిన విషయం తెలిసిందే. ఈ నెల 20న సినిమా విడుదలవుతుండడంతో చిత్రబృందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా సితార ఘట్టమనేని ఈ సినిమా గురించి మాట్లాడిన వీడియోను విడుదల చేసింది. ‘‘ముఫాసా లాంటి గొప్ప పాత్రకు నాన్న గొంతునిస్తున్నందుకు ఎంతో గర్విస్తున్నాను. ప్రేమించడంలో.. జాగ్రత్తగా చూసుకునే విషయంలో నాన్నకూ.. ముఫాసాకు చాలా పోలికలు ఉన్నాయి. నాన్న ఈ సినిమాలో భాగమయ్యారని తెలియగానే ఎంతో సంతోషించా.. సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను. నీ కంటే ముందుగానే ‘ఫ్రోజెన్’ సినిమాతో డిస్నీ ప్రపంచంలోకి అడుగుపెట్టానని అప్పుడప్పుడూ.. నాన్నను ఆటపట్టిస్తుంటాను’’ అని చెప్పారు.