నా దృష్టిలో... వేడుక అంటే ఇదే

ABN, Publish Date - Sep 26 , 2024 | 01:20 AM

నటి శోభితా ధూళిపాళ, నాగచైతన్య ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న సంగతి విదితమే. ఎంతో సింపుల్‌గా జరిగిన ఈ ఎంగేజ్‌మెంట్‌ గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ వేడుకను గ్రాండ్‌గా...

నటి శోభితా ధూళిపాళ, నాగచైతన్య ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న సంగతి విదితమే. ఎంతో సింపుల్‌గా జరిగిన ఈ ఎంగేజ్‌మెంట్‌ గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ వేడుకను గ్రాండ్‌గా చేసుకోవాలని ముందుగా ప్లాన్‌ చేయలేదు. ఇలా ఉండాలి.. అలా ఉండాలి అని కలలు కనలేదు. జస్ట్‌.. జీవితంలో అతి ముఖ్యమైన ఆ మధురక్షణాలని ఆస్వాదించాలని అనుకున్నాను. తెలుగు సంప్రదాయాలకు అనుగుణంగా ఇలాంటి వేడుకలు జరగాలని కోరుకునేదాన్ని. ఇది ఇలాగే జరిగింది. కాబట్టి ఈ వేడుక నిరాడంబరంగా జరిగిందని అనుకోవట్లేదు. నా వరకూ ఇదో పర్ఫెక్ట్‌ పద్దతిలో సాగిన వేడుక’’ అని చెప్పారు.

Updated Date - Sep 26 , 2024 | 01:20 AM