డబ్బింగ్‌ పనుల్లో...

ABN, Publish Date - Oct 28 , 2024 | 12:22 AM

హీరో వెంకటేశ్‌, దర్శకుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కలయికలో రూపొందుతున్న ఈ మూడో చిత్రానికి వర్కింగ్‌ టైటిల్‌ ‘వెంకీ అనిల్‌ 03’. దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు....

హీరో వెంకటేశ్‌, దర్శకుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కలయికలో రూపొందుతున్న ఈ మూడో చిత్రానికి వర్కింగ్‌ టైటిల్‌ ‘వెంకీ అనిల్‌ 03’. దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. ఐశ్వర్య రాజేశ్‌, మీనాక్షీ చౌదరి హీరోయిన్లు. ఈ చిత్ర షూటింగ్‌ దాదాపు 90ు పూర్తైంది. ప్రస్తుతం డబ్బింగ్‌ పనులను ఆరంభించారు. ఈ మేరకు ఓ వీడియోను కూడా విడుదల చేశారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఈ ట్రయాంగ్యులర్‌ క్రైమ్‌ డ్రామాలో రాజేంద్రప్రసాద్‌, సాయికుమార్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎడిటర్‌: తమ్మిరాజు, డీఓపీ: సమీర్‌రెడ్డి, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో.

Updated Date - Oct 28 , 2024 | 12:22 AM