వైవిధ్యమైన పాత్రలో...
ABN, Publish Date - Dec 17 , 2024 | 05:57 AM
నటనకు ఆస్కారమున్న పాత్రలు పోషించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు లావణ్య త్రిపాఠి. ఆమె ప్రధాన పాత్రలో నటించే చిత్రం ‘సతీ లీలావతి’. ‘ఎస్.ఎమ్.ఎస్’ ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వంలో...
నటనకు ఆస్కారమున్న పాత్రలు పోషించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు లావణ్య త్రిపాఠి. ఆమె ప్రధాన పాత్రలో నటించే చిత్రం ‘సతీ లీలావతి’. ‘ఎస్.ఎమ్.ఎస్’ ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వంలో ఎమ్. నాగమోహన్ బాబు, టీ.రాజేశ్ సంయుక్తంగా నిర్మించనున్నారు. లావణ్య త్రిపాఠి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించారు. ఇందులో ఆమె పోషించే పాత్ర ఎంతో వైవిధ్యంగా ఉండబోతోందని.. ఒక ఆసక్తికర కథాంశంతో సినిమా తెరకెక్కుతోందని మేకర్స్ పేర్కొన్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. వరుణ్‌తేజ్‌తో పెళ్లి తర్వాత లావణ్య నటించే చిత్రం ఇదే కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి ఎడిటర్: సతీశ్ సూర్య, సినిమాటోగ్రఫీ: బినేంద్ర మీనన్, సంగీతం: మిక్కీ.జే. మేయర్.