ఇడిచిపెట్టను.. తేల్చాల్సిందే

ABN, Publish Date - Dec 18 , 2024 | 02:33 AM

వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరయిన హీరో అడివి శేష్‌. షానీల్‌ డియో దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం ‘డెకాయిట్‌’. ‘ఓ ప్రేమ కథ’ ఉప శీర్షిక...

వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరయిన హీరో అడివి శేష్‌. షానీల్‌ డియో దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం ‘డెకాయిట్‌’. ‘ఓ ప్రేమ కథ’ ఉప శీర్షిక. మంగళవారం, ఆయన పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఈ సినిమా నుంచి ఓ పోస్టర్‌ను వదిలింది. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇదివరకు విడుదల చేసిన గ్లింప్స్‌లో కథానాయికగా శ్రుతిహాసన్‌ని చూపించారు. అయితే ప్రస్తుతం రిలీజ్‌ చేసిన పోస్టర్‌లో మృణాల్‌ ఠాకూర్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ పోస్టర్‌ను సోషల్‌మీడియాలో షేర్‌ చేసిన అడివి శేష్‌ ..‘‘అవును ప్రేమించావు.. కానీ మోసం చేశావు. ఇడిచిపెట్టను.. తేల్చాల్సిందే’’ అని పేర్కొన్నారు. దీనికి స్పందించిన మృణాల్‌.. ‘‘అవును వదిలేశాను..


కానీ మనస్ఫూర్తిగా ప్రేమించాను’’ అని తన ఖాతాలో పోస్టర్‌ను షేర్‌ చేసి, శేష్‌కు బర్త్‌ డే విషెస్‌ తెలిపారు. మరోవైపు, అడివి శేష్‌ నటిస్తున్న చిత్రాలు ‘గూఢచారి’ సీక్వెల్‌ ‘జీ 2’.. ‘హిట్‌ 3’. ఈ సినిమాల్లో శేష్‌ లుక్‌ను విడుదల చేసిన చిత్రబృందాలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాయి.

Updated Date - Dec 18 , 2024 | 02:33 AM