నేను పారిపోలేదు
ABN, Publish Date - Dec 15 , 2024 | 01:43 AM
తాను ఎక్కడికీ పారిపోలేద ని, తన ముందస్తు బెయిల్‌ను న్యాయస్థానం తిరస్కరించలేదని సినీ నటుడు మోహన్‌బాబు వెల్లడించారు. ఈ విషయాన్ని శనివారం సోషల్ మీడియా ద్వారా...
తాను ఎక్కడికీ పారిపోలేద ని, తన ముందస్తు బెయిల్‌ను న్యాయస్థానం తిరస్కరించలేదని సినీ నటుడు మోహన్‌బాబు వెల్లడించారు. ఈ విషయాన్ని శనివారం సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నానని, జల్‌పల్లిలోని ఇంట్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నానని వెల్లడించారు. మీడియా వాస్తవాలను వెల్లడించాలని, తప్పుడు ప్రచారాలు చేయొద్దని కోరారు. జర్నలిస్టుపై జరిగిన దాడి కేసులో ‘మోహన్‌బాబుకు న్యాయస్థానంలో ఊరట లభించలేదు, ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది’ అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని ఆయన తెలిపారు. జల్‌పల్లిలోని తన నివాసంలో మీడియాపై దాడి చేసిన ఘటనలో పహాడీషరీప్ పోలీసులు ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణను న్యాయస్థానం ఈనెల 19కి వాయిదా వేసినట్లు తెలిసింది.
హైదరాబాద్ సిటీ (ఆంధ్రజ్యోతి)