చాలా నమ్మకంతో ఉన్నాను

ABN, Publish Date - Oct 21 , 2024 | 03:33 AM

విష్వక్‌సేన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మెకానిక్‌ రాకీ’. రవితేజ ముళ్లపూడి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్నారు. నవంబర్‌ 22న విడుదలవుతోంది....

విష్వక్‌సేన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మెకానిక్‌ రాకీ’. రవితేజ ముళ్లపూడి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్నారు. నవంబర్‌ 22న విడుదలవుతోంది. ఆదివారం చిత్రబృందం ట్రైలర్‌ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ సాగిన ట్రైలర్‌ ఆధ్యంతం వినోదం పంచింది. విష్వక్‌సేన్‌ స్టైలిష్‌ నటనతో కట్టిపడేశారు. విలన్‌ పాత్రలో సునీల్‌ పలికించిన క్రౌర్యం అలరించింది. ఈ కార్యక్రమంలో విష్వక్‌సేన్‌ మాట్లాడుతూ ‘నన్ను ఇక్కడివరకూ తీసుకొచ్చింది ప్రేక్షకుల అభిమానమే. సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నాను. సంభ్రమాశ్చర్యాలకు గురిచేసేలా సినిమా ఉండబోతోంది. శ్రద్ధా శ్రీనాథ్‌, మీనాక్షి చౌదరి అద్భుతంగా నటించారు’ అని చెప్పారు. రవితేజ ముళ్లపూడి మాట్లాడుతూ ‘ట్రైలర్‌లో కొంతే చూశారు. సినిమాలో చాలా కంటెంట్‌ ఉంది. ఇక నుంచి వరుస అప్డేట్స్‌ ఇస్తాం.


ప్రేక్షకులు మా సినిమాను ఆదరించాలి’ అని కోరారు. రామ్‌ తాళ్లూరి మాట్లాడుతూ ‘ప్రేక్షకులకు ట్రైలర్‌ నచ్చినందుకు ఆనందంగా ఉంది. సినిమా కూడా మాస్‌ కా దాస్‌ రేంజ్‌లో ఉంటుంది. థియేటర్లలో మాస్‌ జాతర ఖాయం’ అన్నారు. కథలో కీలకమైన పాత్ర నాది, దర్శకుడు సినిమాను తెరకెక్కించిన తీరు అద్భుతం అని శ్రద్ధా శ్రీనాథ్‌ చెప్పారు.

Updated Date - Oct 21 , 2024 | 03:33 AM