అక్టోబర్‌లో హారర్‌ థ్రిల్లర్‌

ABN, Publish Date - Aug 16 , 2024 | 12:11 AM

వెంకటసాయి గుండ ప్రధాన పాత్రలో నటించిన హాలివుడ్‌ చిత్రం ‘ద డిజర్వింగ్‌’. ఈ సైకలాజికల్‌ హారర్‌ థ్రిల్లర్‌ను కోకా సింగ్‌ అరోర దర్శకత్వంలో...

వెంకటసాయి గుండ ప్రధాన పాత్రలో నటించిన హాలివుడ్‌ చిత్రం ‘ద డిజర్వింగ్‌’. ఈ సైకలాజికల్‌ హారర్‌ థ్రిల్లర్‌ను కోకా సింగ్‌ అరోర దర్శకత్వంలో వెంకటసాయి గుండ, తిరుమలేశ్‌ గుండ్రాత్‌, విస్మయ్‌కుమార్‌ కొత్తపల్లి నిర్మించారు. సమాజంలో జరిగే పలు అంశాలను ఆధారం చేసుకుని విభిన్నంగా తెరకెక్కింది. తాజాగా చిత్రబృందం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ‘ద డిజర్వింగ్‌’ను ఆక్టోబరు 1న విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - Aug 16 , 2024 | 12:11 AM