మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Honeymoon Express: దర్శకేంద్రుడు వదిలిన ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ టైటిల్ ట్రాక్

ABN, Publish Date - Jun 02 , 2024 | 02:13 AM

ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో, న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై.. చైతన్యరావు, హెబ్బాపటేల్‌ జంటగా నటించిన రొమాంటిక్‌ ఎంటర్టైనర్‌ ‘హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌’. తనికెళ్ల భరణి మరియు సుహాసిని ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి బాల రాజశేఖరుని రచయిత, దర్శకుడు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు. తాజాగా ఈ చిత్ర టైటిల్ ట్రాక్‌ని దర్శకేంద్రుడు విడుదల చేశారు.

Honeymoon Express Title Lyrical Song Release Event

ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్ (NRI Entertainments (USA) సమర్పణలో, న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (New Reel India Entertainments Pvt Ltd) పతాకంపై.. చైతన్యరావు, హెబ్బాపటేల్‌ జంటగా నటించిన రొమాంటిక్‌ ఎంటర్టైనర్‌ ‘హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌’. సుహాసినీ, తనికెళ్ల భరణి కీలకపాత్రలు పోషిస్తున్నారు. బాల రాజశేఖరుని దర్శకత్వంలో కేకేఆర్‌, బాల రాజ్‌ నిర్మించారు. శనివారం ‘హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌’ టైటిల్‌ సాంగ్‌ను దర్శకుడు కె. రాఘవేంద్రరావు చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.


సాంగ్ విడుదల అనంతరం దర్శకేంద్రుడు మాట్లాడుతూ.. దర్శకుడు బాల మంచి టైటిల్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. టైటిల్‌ సాంగ్‌ చాలా బావుంది. ఈ సినిమా మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. పాప్‌ సింగర్‌ స్ఫూర్తి జితేందర్‌ ఈ టైటిల్‌ పాటను స్వరపరిచి, ఆలపించారు. ఈ చిత్రానికి సంగీతం: కల్యాణి మాలిక్‌, సినిమాటోగ్రఫీ: శిష్టా వీఎంకే

Updated Date - Jun 02 , 2024 | 02:26 PM