హిట్టా.. బ్లాక్‌బస్టరా అనేది వారి చేతుల్లో ఉంది

ABN, Publish Date - Dec 19 , 2024 | 06:12 AM

‘‘హనుమాన్‌’ చిత్రం విజయంతో ఈ ఏడాది ఘనంగా ఆరంభమైంది. ఇప్పుడు ‘బచ్చలమల్లి’ సినిమా సక్సె్‌సతో ఈ ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమకు అదిరిపోయే ముగింపు ఇవ్వాలి’ అని అల్లరి నరేశ్‌....

‘‘హనుమాన్‌’ చిత్రం విజయంతో ఈ ఏడాది ఘనంగా ఆరంభమైంది. ఇప్పుడు ‘బచ్చలమల్లి’ సినిమా సక్సె్‌సతో ఈ ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమకు అదిరిపోయే ముగింపు ఇవ్వాలి’ అని అల్లరి నరేశ్‌ ప్రేక్షకులను కోరారు. ఆయన కథానాయకుడిగా నటించిన ‘బచ్చలమల్లి’ ఈ నెల 20న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. అల్లరి నరేశ్‌ మాట్లాడుతూ ‘నిర్మాత రాజేశ్‌ ఏ విషయంలోనూ రాజీ పడకుండా సినిమాను అన్ని హంగులతో నిర్మించారు. ఎంత కష్టమైనా అవసరమైనవన్నీ సమకూర్చారు. దర్శకుడు సుబ్బు ఈ సినిమా కథ చెప్పగానే నాకు బాగా నచ్చింది. ఈ సినిమాను హిట్‌ చేస్తారా, బ్లాక్‌ బస్టర్‌ చేస్తారా అనేది ప్రేక్షకుల చేతుల్లో ఉంది. అయితే ఒక్కటి మాత్రం బలంగా నమ్ముతున్నాను. ‘ఈ క్రిస్మస్‌ మనదే’’ అన్నారు. దర్శకుడు సుబ్బు మాట్లాడుతూ


‘ఈ రోజు నేను దర్శకుడిగా మీ ముందుకు రావడానికి కారణమైన సాయిదుర్గాతేజ్‌, మారుతికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. బచ్చలమల్లి పాత్రను కేవలం నరేశ్‌ మాత్రమే చేయగలరు’ అని చెప్పారు. నిర్మాత రాజేశ్‌ దండా మాట్లాడుతూ ‘‘బచ్చలమల్లి’ నా మనసుకు దగ్గరైన కథ. ఈ సినిమా కోసం నేను కూడా ప్రేక్షకుడిలా ఎదురుచూస్తున్నాను. నరేశ్‌ లేకపోతే ‘బచ్చలమల్లి’ లేదు. ఆయన మూడు గెట్‌ప్సలో అలరిస్తారు’ అని అన్నారు.

Updated Date - Dec 19 , 2024 | 06:12 AM