బూసాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ‘హీరామండి’
ABN, Publish Date - Aug 31 , 2024 | 06:03 AM
ప్రతిష్ఠాత్మక బూసాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ‘హీరామండి’ వెబ్‌సిరీస్ నామినేట్ అయింది. ఉత్తమ ఓటీటీ ఒరిజినల్, ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగాల్లో ఇది నామినేట్ అయింది.
ప్రతిష్ఠాత్మక బూసాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ‘హీరామండి’ వెబ్‌సిరీస్ నామినేట్ అయింది. ఉత్తమ ఓటీటీ ఒరిజినల్, ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగాల్లో ఇది నామినేట్ అయింది. బూసాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు తన సిరీస్ నామినేట్ అవ్వడం పట్ల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఆనందం వ్యక్తం చేశారు. ‘ఈ చిత్రోత్సవాలకు రెండు విభాగాల్లో నామినేట్ అవ్వడం మా టీమ్‌కు గర్వకారణం’ అని ఆయన సోషల్ మీడియాలో తెలిపారు. ఈ సారి ఇండియా నుంచి బూసాన్ చలన చిత్రోత్సవాలకు ఎంపికైన ఏకైక ప్రాజెక్ట్ గా ‘హీరామండి’ నిలిచింది. మనీషా కొయిరాలా, అదితీరావ్ హైదరీ, సోనాక్షి సిన్హా తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ వెబ్‌సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై ప్రేక్షకాధరణ పొందింది.