Pushpa-2 : హై రేంజ్ మాస్ ఎలివేషన్స్
ABN, Publish Date - May 02 , 2024 | 04:39 AM
‘పుష్ప‘ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన సంగతి తెలిసిందే. సినిమా ఆ రేంజ్‌లో హిట్ కావడానికి అందులో పాటలు కూడా ఓ కారణమనే చెప్పాలి. ఇప్పుడు...
‘పుష్ప‘ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన సంగతి తెలిసిందే. సినిమా ఆ రేంజ్‌లో హిట్ కావడానికి అందులో పాటలు కూడా ఓ కారణమనే చెప్పాలి. ఇప్పుడు సీక్వెల్‌గా వస్తున్న ‘పుష్ప-2’లోని పాటలు మరింత ఆకట్టుకునేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ను మంగళవారం మేకర్స్ విడుదల చేశారు. ఇందులో అల్లు అర్జున్ క్యారెక్టర్ పుష్పరాజ్‌కు హై రేంజ్ మాస్ ఎలివేషన్స్ ఇచ్చేలా ‘పుష్ప పుష్ప’ టైటిల్ సాంగ్ లిరిక్స్ సాగాయి. ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, నకాశ్ అజీజ్, దీపక్ బ్లూ ఆలపించారు. చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఆగస్టు 15న ‘పుష్ప-2’ రిలీజ్ అవుతోంది.