Vijay Antony: పోరాట సన్నివేశాలే హైలైట్ గా 'తుఫాన్'
ABN, Publish Date - Jul 30 , 2024 | 04:38 PM
విజయ్ ఆంటోనీ సినిమాలు అంటే తెలుగులో కూడా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తూ వుంటారు. 'బిచ్చగాడు' సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న విజయ్ ఆంటోనీ ఇప్పుడు 'తుఫాన్' గా రానున్నారు
తమిళ నటుడు విజయ్ ఆంటోనీ సినిమాలు ఇప్పుడు తెలుగులోకి అనువాదం అవుతూ విడుదల అవుతున్నాయి. అతను నటించిన తాజా చిత్రం 'తుఫాన్'. ఈ సినిమాకి కమల్ బోరా, డి లలితా, బి ప్రదీప్, పంకజ్ బోరా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ గతంలో విజయ్ ఆంటోనీ కథానాయకుడిగా 'రాఘవన్', 'హత్య' సినిమాలను నిర్మించింది. ఈ 'తుఫాన్' సినిమాకి దర్శకుడు విజయ్ మిల్టన్. ఈ సినిమా ఆగస్టు 2న థియేట్రికల్ రిలీజ్ అవుతోంది.
ప్రచారంలో భాగంగా ఈరోజు ఈ చిత్ర నిర్వాహకులు ఈ సినిమాకి సంబంధించి స్నీక్ పీక్ అనే ఒక వీడియో విడుదల చేశారు. ఇందులో పోరాట సన్నివేశాలు చాలా బాగున్నాయి, ఆసక్తికరగాం వున్నాయి. ఒక పోలీస్ ఆఫీసర్, హోటల్ నిర్వహిస్తున్న ఒక యువకుడిని, అతని మదర్ ను డాలీ అనే వ్యక్తి గురించి, మాల్ లో జరిగిన సంఘటన గురించి ఇంటరాగేట్ చేస్తాడు. ఆ మాల్ లో తప్పు చేస్తున్న కొందరిని కొట్టిన వ్యక్తి గురించి ప్రశ్నిస్తాడు. పోలీస్ ఆఫీసర్ తో పాటు పదుల సంఖ్యలో విలన్స్ ఆ హోటల్ కు వస్తారు.
వీళ్లంతా తెలుసుకోవాలనుకుంటున్న వ్యక్తి వారి ఎదుటే నిలబడతాడు. పోలీస్ ఆఫీసర్ ముందే ఆ విలన్స్ తో ఫైట్ చేస్తాడు కథానాయకుడు. ఈ పోరాట సన్నివేశాము ఈరోజు విడుదల చేసిన ఈ స్నీక్ పీక్ ప్రచా వీడియోలో ఆసక్తికరంగా ఉండటంతో పాటు, సినిమాలో అదే హైలైట్ కానుంది అని చిత్ర నిర్వాహకులు అంటున్నారు.
విజయ్ ఆంటోనీ తో పాటు శరత్ కుమార్, సత్యరాజ్, డాలీ ధనుంజయ, మేఘా ఆకాష్, మురళీ శర్మ, పృథ్వీ అంబర్, శరణ్య పొన్వన్నన్, తలైవాసల్ విజయ్ తదితరులు ఈ సినిమాలో నటించారు.