Samantha : ఇక్కడ కూడా అలాంటి కమిటీ వేయాలి

ABN, Publish Date - Aug 31 , 2024 | 06:12 AM

మాలీవుడ్‌లో కొనసాగుతున్న కీచకుల అకృత్యాలను బయట పెట్టిన జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్ట్‌ను హీరోయిన్‌ సమంత స్వాగతించిన విషయం తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమలోని లైంగిక వేధింపులపై

మాలీవుడ్‌లో కొనసాగుతున్న కీచకుల అకృత్యాలను బయట పెట్టిన జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్ట్‌ను హీరోయిన్‌ సమంత స్వాగతించిన విషయం తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమలోని లైంగిక వేధింపులపై తెలంగాణ ప్రభుత్వం కూడా దృష్టి సారించాలనీ, జస్టిస్‌ హేమ కమిటీ తరహాలో ఇక్కడ కూడా ఓ కమిటీ వేయాలని సమంత కోరారు. వేధింపులకు గురి కాకుండా తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం అప్పుడే మహిళా ఆర్టిస్టులకు ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ‘తెలుగు చిత్రపరిశ్రమలో మహిళలుగా మేమంతా జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్ట్‌కు స్వాగతం పలుకుతున్నాం. అలాగే కీచకులపై పోరాటం చేస్తున్న డబ్ల్యూ సీసీ చర్యలను అభినందిస్తున్నాం. మాలీవుడ్‌లో మహిళల హక్కుల కోసం డబ్ల్యూసీసీ విజయవంతమైన పోరాటం చేసింది’ అని సమంత అన్నారు.

Updated Date - Aug 31 , 2024 | 06:12 AM