Janata Bar: రాయ్ లక్ష్మీ ‘జనతా బార్’లో ఎలా ఉందో చూశారా..
ABN, Publish Date - Apr 11 , 2024 | 05:59 PM
గ్లామర్ క్వీన్ రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రలో నటిస్తున్న తెలుగు చిత్రం ‘జనతా బార్’. రోచిశ్రీ మూవీస్ పతాకంపై అశ్వథ్ నారాయణ సమర్పణలో రమణ మొగిలి స్వీయదర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు శక్తికపూర్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను హీరో శ్రీకాంత్ విడుదల చేసి, చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
గ్లామర్ క్వీన్ రాయ్ లక్ష్మీ (Raai Laxmi) ప్రధాన పాత్రలో నటిస్తున్న తెలుగు చిత్రం ‘జనతా బార్’ (Janata Bar). రోచిశ్రీ మూవీస్ పతాకంపై అశ్వథ్ నారాయణ సమర్పణలో రమణ మొగిలి (Raman Mogili) స్వీయదర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు శక్తికపూర్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను హీరో శ్రీకాంత్ (Hero Srikanth) విడుదల చేశారు. ట్రైలర్ చాలా బాగుందని, సినిమా గొప్ప విజయం సాధించి.. టీమ్ అందరికీ మంచి పేరు తీసుకురావాలని శ్రీకాంత్ అన్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం మేలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ట్రైలర్ విడుదల సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. కుస్తీ పోటీల నేపథ్యంలో నడిచే కథ ఇది. నేటి సమాజంలో స్త్రీ ప్రాధాన్యతను చాటి చెప్పేలా ఉంటుంది. నాలుగు పాటలు, ఫైట్స్‌లతో కొనసాగే రెగ్యులర్ చిత్రం కాదు.. కమర్షియల్ అంశాలు వుంటూనే సమాజానికి చక్కని సందేశాన్ని మేళవించి రూపొందించిన చిత్రమిదని తెలుపుతూ.. ట్రైలర్ విడుదల చేసిన శ్రీకాంత్ ధన్యవాదాలు అని అన్నారు. (Janata Bar Trailer Released)
హీరోయిన్ రాయ్ లక్ష్మీ (Raai Laxmi) మాట్లాడుతూ.. తెలుగులో మంచి చిత్రం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో రమణ మొగిలి చెప్పిన ఈ కథ నన్ను ఎంతో ఆలోచింపజేసింది. ఒకవేళ ఈ చిత్రం చేయకపోతే నా కెరీర్‌లో ఓ మంచి చిత్రాన్ని కోల్పోయేదాన్ని. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఈ సినిమా ఎంతో ఉపయోగపడింది. ఈ చిత్రంలో నా పాత్ర బార్‌గర్ల్‌గా ప్రారంభమై సమాజంలో మహిళలు గొప్పగా చెప్పుకునే స్థాయికి ఎలా ఎదిగింది? అనేది ఎంతో ఆసక్తికరంగా వుంటుందని అన్నారు. (Laxmi Raai Janata Bar Movie)
యానిమల్ (Animal) తరువాత ఈ చిత్రంలో మళ్లీ ఓ మంచి పాత్రను చేశానని, ఈ సినిమాలో తన పాత్ర నలుగురు చెప్పుకునేంత గొప్పగా వుంటుందని శక్తికపూర్ తెలిపారు. (Janatha Bar)
ఇవి కూడా చదవండి:
====================
*Manjummel Boys: తెలుగు వెర్షన్ ప్రదర్శనలను నిలిపేసిన పీవీఆర్ మల్టిఫ్లెక్స్
**********************
*Aa Okkati Adakku: ‘ఆ ఒక్కటి అడక్కు’ తెలుగు రాష్ట్రాల హక్కులు ఎవరికంటే..
****************************
*Devara: ‘లైగర్’ నిర్మాత చేతికి ‘దేవర’.. ఆ చిక్కులు తప్పవా!
*********************