Sree Vishnu: కొత్తగా ఏదైనా ప్రయత్నించినప్పుడు ఇలాంటి చిన్నచిన్నవి సహజం

ABN, Publish Date - Oct 09 , 2024 | 01:13 PM

కొత్తగా ఏదైనా ప్రయత్నించినప్పుడు ఇలాంటి చిన్నచిన్నవి సహజం. ‘శ్వాగ్’ విషయంలో నిరాశపడిన 10 శాతం మందికి నెక్స్ట్ సినిమాకి వడ్డీతో సహా ఇచ్చేస్తానని అన్నారు శ్రీవిష్ణు. ‘శ్వాగ్’ సక్సెస్ మీట్‌లో శ్రీవిష్ణు చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇంకా ఆయన ఏమన్నారంటే..

Sree Vishnu in Swag

కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీవిష్ణు (Sree Vishnu), ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి (Hasith Goli) కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘శ్వాగ్’ (Swag). పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రీతూ వర్మ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్ ఇతర కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి, విమర్శకులు ప్రశంసలు అందుకొని థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ నేపధ్యంలో మేకర్స్ గ్రాండ్‌గా ఆడియన్స్ విక్టరీ శ్వాగ్ పేరుతో సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ సక్సెస్‌మీట్‌లో హీరో శ్రీ విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read- Manchu Vishnu: మంచు విష్ణుకు అనుకూలంగా కోర్టు తీర్పు.. ఇక ఉంటది ఒక్కొక్కడికి..


హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గారికి, నాకోసం ఇలాంటి మంచి కథ రాసిన హసిత్ గోలికి, సినిమా కోసం పనిచేసిన టీంలో ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. రీతు వర్మ, దక్ష, మీరాజాస్మిన్, సునీల్ గారు అందరూ చాలా అద్భుతంగా చేశారు. కొన్ని సినిమాలు బాగున్నాయి అనిపిస్తాయి. ఇంకొన్ని సినిమాలు అంత లేదులే అనిపిస్తాయి. కానీ కొన్ని సినిమాలు చూసి వచ్చిన తర్వాత కూడా మనల్ని వెంటాడుతాయి. దాని గురించి ఒక డిస్కషన్ జరిగేలా చేస్తాయి. అలాంటి సినిమానే స్వాగ్.


ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. డిస్కషన్స్ నుంచి చాలా వాలిడ్ పాయింట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా మేము ఫస్ట్ డే నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం. సినిమా చూసినోళ్లు 90 శాతం మంది శాటిస్‌ఫై అయ్యారు. 10 శాతం మంది కొంచెం కాంప్లెక్స్ ఉంది అని ఫీల్ అయ్యారని హసిత్ చెప్పాడు. కొత్తగా ఏదైనా ప్రయత్నించినప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి. శ్వాగ్ సినిమాని ఎవ్వరూ కూడా బాలేదని అనలేదు. దానికి ప్రేక్షకులందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నేను చేసిన చాలా సినిమాలకి ఇప్పటికీ ప్రశంసలు వస్తుంటాయి. ఆ సినిమా ప్రశంసలు ఆగిపోయి, ఈ సినిమా ప్రశంసలు మొదలవుతాయని ఆశిస్తున్నాను. ఈ ప్రశంసలు కొనసాగుతూనే ఉంటాయని నమ్ముతున్నాను. ఈ సినిమా చూసే కొద్ది కొత్త విషయాలు తెలుస్తుంటాయి. ఏ ఉద్దేశంతో ఈ సినిమా తీశామో అర్థం అవుతుంది.

Also Read- Prabhas: ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ.. ఎప్పుడంటే



మమ్మల్ని గెలిపించిన తెలుగు ప్రేక్షకుల్ని గెలిపించడానికి ఈ సినిమా చేస్తున్నానని మొదటి నుంచి చెప్తున్నాను. నిజంగానే మీరంతా గెలిచారు. మీరు గెలిచి మమ్మల్ని గెలిపించారు. ఇలాంటి రిస్కులు, కొత్త కథలు ట్రై చేయకపోతే రాబోయే తరాన్ని మనం ఇన్ స్పైర్ చేయలేం. ఏమీ లేని నాకు ఇంత గుర్తింపు ఇచ్చారు. తెలుగు ఆడియన్స్ రుణం తీర్చుకోవాలి. ఆ రుణం తీర్చే ప్రాసెస్‌లో ఇలాంటి గొప్ప కథలు చేయడానికి ప్రయత్నిస్తుంటాను. హసిత్ నా ఫ్యాన్. నాకు ఒక తమ్ముడిలా అనమాట. నాకు ఇంత మంచి కథ, పాత్రలు రాసినందుకు థాంక్యూ. ఆడియన్స్ నేను చేసిన ప్రతి క్యారెక్టర్‌ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈసారి రాస్తే దీన్ని కొట్టేది రాయాలి. రాస్తాడనే నమ్మకం కూడా ఉంది. విశ్వ గారు మాకు ఇంత ఫ్రీడమ్ ఇవ్వకపోతే ఇలాంటి కథను చేయలేం. పీపుల్ మీడియా టీమ్ అందరికీ థాంక్యు. సినిమాని జనాల్లోకి తీసుకెళ్లిన మీడియా మిత్రులందరికీ థాంక్యూ. ఆ 10 శాతం మంది కూడా కంగారు పడకండి. నెక్స్ట్ సినిమాకి వడ్డీతో సహా ఇచ్చేస్తాను. లేకపోతే లావు అయిపోతాను..’’ అంటూ సరదాగా చమత్కరించారు.

Also Read- Trivikram Srinivas: సమంతపై త్రివిక్రమ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

Also Read- Rajendra Prasad: రాజేంద్రప్రసాద్‌కు తలసాని పరామర్శ

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 09 , 2024 | 01:13 PM