Nikhil: ‘కార్తికేయ 2’కు నేషనల్ అవార్డ్.. హీరో నిఖిల్ స్పందనిదే..

ABN, Publish Date - Aug 16 , 2024 | 04:27 PM

70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను (70th National Film Awards) శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. 2022లో దేశవ్యాప్తంగా సుమారు 28 భాషల్లో విడుదలైన 300కు పైగా చిత్రాలు ఈ అవార్డ్స్ కోసం నామినేషన్‌లో ఉండగా.. అందులో తెలుగుకు సంబంధించి 20 చిత్రాలు ఉన్నాయి. ఇందులో కేవలం కార్తికేయ 2 చిత్రానికి మాత్రమే అవార్డ్ వరించింది. ఈ అవార్డు రావడం పట్ల నిఖిల్ సంతోషం వ్యక్తం చేశారు.

Hero Nikhil in Karthikeya 2

70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను (70th National Film Awards) శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. 2022లో దేశవ్యాప్తంగా సుమారు 28 భాషల్లో విడుదలైన 300కు పైగా చిత్రాలు ఈ అవార్డ్స్ కోసం నామినేషన్‌లో ఉండగా.. అందులో తెలుగుకు సంబంధించి 20 చిత్రాలు ఉన్నాయి. కానీ ఒకే ఒక్క అవార్డ్ టాలీవుడ్‌ (Tollywood)కు రావడంతో, ప్రపంచవ్యాప్తంగా టాప్‌లో దూసుకెళుతోన్న తెలుగు సినిమా ఇండస్ట్రీకి సరైన ఈ అవార్డులలో సరైన గుర్తింపు దక్కలేదంటూ టాలీవుడ్ ప్రేక్షకులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలుగుకు సంబంధించి వచ్చిన ఒకే ఒక్క అవార్డ్ ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు) కేటగిరీలో ‘కార్తికేయ 2’ (Karthikeya 2) చిత్రానికి వరించింది. ఈ అవార్డ్ రావడం పట్ల ఆ చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. తాజాగా హీరో నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth).. ఈ అవార్డు పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు.

Also Read- Thangalaan Review: ‘బంగారం’లాంటి సినిమా..

ఈ వీడియోలో నిఖిల్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడే ఓ అద్భుతమైన వార్త వినడం జరిగింది. మన సినిమా ‘కార్తికేయ 2’ నేషనల్ అవార్డు గెలుచుకుందనే వార్త అది. చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని మీతో పంచుకోవడానికి వెంటనే మీ ముందుకు వచ్చాను. ఈ సినిమా ఇంత గొప్పగా సక్సెస్ కావడానికి కారణం, అలాగే ఈ అవార్డు రావడానికి కారణం మా ఎంటైర్ టీమ్ ఎఫర్ట్. మా నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్, వివేక్.. అలాగే మై బ్రదర్, మై మ్యాన్ డైరెక్టర్ చందూ మొండేటి. ఇంత మంచి సినిమాను తీసి, మరియు రాశారు. మా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, మా మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ, డీఓపీ కార్తీక్ ఘట్టమనేని.. ఇలా పేరుపేరునా అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. (Nikhil Response on National Award to Karthikeya 2)


చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ చూసిన సినిమా ఇది. అలాగే దేశవ్యాప్తంగా చాలా భాషల్లో రిలీజై, చాలా మంచి సక్సెస్‌ను సాధించింది. ముందు ప్రేక్షకులందరికీ థ్యాంక్స్. ఈ సినిమాను చూసి, ఆదరించి, ఇంత ప్రేమ కురిపించారు. అలాగే నేషనల్ అవార్డు కౌన్సిల్‌కు కూడా ఈ సినిమాను తీసుకున్నందుకు థ్యాంక్స్. అందరికీ థ్యాంక్యూ సో మచ్’’ అని చెప్పుకొచ్చారు.

Read Latest Cinema News

Updated Date - Aug 16 , 2024 | 04:27 PM