మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hema Rave Party: బెంగళూరు డ్రగ్స్ కేసులో బెయిల్.. జైలు నుంచి హేమ విడుదల

ABN, Publish Date - Jun 14 , 2024 | 04:49 PM

బెంగళూరు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన హేమ బెంగళూరు జైలు నుంచి విడుదలయ్యారు. గురువారం ఆమెకు బెంగళూరు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి ఆమెను విడుదల చేశారు. ఇంతకు ముందు ఇలాంటి కేసులోనే అరెస్ట్ అయిన నటీమణులు సంజన, రాగిణి ద్వివేది వంటి వారు కూడా ఇలాగే విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పుడీ జాబితాలోకి నటి హేమ కూడా చేరారు.

Hema Released From Jail

బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ కేసులో (Bengaluru Rave Party Case) అరెస్ట్ అయిన హేమ (Actress Hema) బెంగళూరు జైలు నుంచి విడుదలయ్యారు. గురువారం ఆమెకు బెంగళూరు కోర్టు షరతులతో కూడిన బెయిల్ (Conditional Bail) ఇవ్వడంతో జైలు నుంచి ఆమెను విడుదల చేశారు. ఇంతకు ముందు ఇలాంటి కేసులోనే అరెస్ట్ అయిన నటీమణులు సంజన (Sanjjanaa), రాగిణి ద్వివేది (Ragini Dwivedi) వంటి వారు కూడా ఇలాగే విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పుడీ జాబితాలోకి నటి హేమ కూడా చేరారు.

రీసెంట్‌గా బెంగళూరు నగర శివారులో ఒక ఫామ్ హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీలో హేమ మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చి చట్ట ప్రకారం ఆమెను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆమెను బెంగుళూరు సిటీ క్రైమ్ కంట్రోల్ బ్యూరో పోలీసులు విచారించి అరెస్ట్ చేశారు. ఆమెను కోర్టులో ప్రొడ్యూస్ చేయగా.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే హేమ వద్ద ఎలాంటి డ్రగ్స్ లేవని ఆమెపై ఆరోపణలు వచ్చిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసుల దగ్గర సాక్షాలు లేవని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. మరోవైపు హేమ రేవ్ పార్టీలో పాల్గొన్న ఆధారాలను సీసీబీ న్యాయవాది కోర్టుకు అందించారు. (Actress Hema Released From Jail in Drugs Case)


ఇక ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం నటి హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. తాను డ్రగ్స్ తీసుకోలేదని ముందు నుంచి హేమ చెబుతూ వచ్చారు. అయితే తాను బెంగళూరులో ఉన్నా సరే హైదరాబాదులో ఉన్నాను అంటూ వీడియో రిలీజ్ చేయడం పెద్ద చర్చకు దారితీసింది. ఈ విషయంలోనే బెంగళూరు పోలీసులు సైతం హేమపై సీరియస్ అయ్యారు. అలాగే డ్రగ్ టెస్ట్‌లో ఆమెకు పాజిటివ్ నిర్ధారణ అయినట్లుగా కూడా వారు వెల్లడించి, ఆమెను అరెస్ట్ చేసే క్రమంలో కూడా హేమ జ్వరమంటూ అరెస్ట్‌ను తప్పించుకున్నారు. మరోసారి నోటీసులు పంపించి ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు హేమకు కోర్టు బెయిల్ మంజూరు (Bail to Actress Hema) చేయడంతో పోలీసులు ఆమెను జైలు నుంచి విడుదల చేశారు.

Updated Date - Jun 14 , 2024 | 04:49 PM