ఫిష్‌ వెంకట్‌కు సాయం

ABN, Publish Date - Sep 05 , 2024 | 03:15 AM

విలన్‌ పాత్రల్లోనూ తనదైన శైలిలో కామెడీని పండిస్తూ తెలుగు ప్రేక్షకులను నవ్వించిన ఫిష్‌ వెంకట్‌ రెండు కిడ్నీలు పాడై దయనీయ స్థితిలో జీవితం వెళ్లదీస్తున్నారు...

విలన్‌ పాత్రల్లోనూ తనదైన శైలిలో కామెడీని పండిస్తూ తెలుగు ప్రేక్షకులను నవ్వించిన ఫిష్‌ వెంకట్‌ రెండు కిడ్నీలు పాడై దయనీయ స్థితిలో జీవితం వెళ్లదీస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం ఖర్చు పెట్టే స్తోమత లేక ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్‌ చేయించుకుంటున్నట్లు ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సినిమాల్లో నటించమని పిలుపు వస్తున్నా ఒంట్లో సత్తువ లేక కొన్నేళ్ల నుంచి ఇంటికే పరిమితమైనట్లు చెప్పారు. ఖర్చులకు చేతిలో పైసా లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు వైద్య ఖర్చుల నిమిత్తం లక్ష రూపాయలను అందజేశారు. ప్రసన్నకుమార్‌, రామసత్యనారాయణ, కె.అజయ్‌కుమార్‌, అనిల్‌ ఈ చెక్కును ఫిష్‌ వెంకట్‌కు అందజేశారు.

Updated Date - Sep 05 , 2024 | 03:15 AM