ఇంట్లో అబ్బాయిలా అక్కున చేర్చుకున్నారు
ABN, Publish Date - Nov 03 , 2024 | 01:03 AM
హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ ‘క’. తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్లు. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో సక్సెస్ మీట్ నిర్వహించారు. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ‘ఘన విజయాన్ని...
హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ ‘క’. తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్లు. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో సక్సెస్ మీట్ నిర్వహించారు. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ‘ఘన విజయాన్ని అందించి ఈ దీపావళికి నాకు పెద్ద కానుక ఇచ్చారు. అందుకు అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా. నన్ను గతంలో పక్కింటి కుర్రాడి ఇమేజ్‌తో ప్రేక్షకులు చూశారు. ఇప్పుడు మన ఇంటి అబ్బాయి అని భావిస్తున్నారు. ఈనెల 8న మలయాళంలో సినిమాను రిలీజ్ చేస్తున్నాం. తమిళనాట ఉన్న తెలుగు ప్రజలు తమకు షోస్ కావాలని అడుగుతున్నారు. ఇంత పెద్ద బ్లాక్‌బస్టర్ అయ్యాక తమిళనాట ఎందుకు రిలీజ్ చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. తమిళనాడులో షోస్ వేయాలని డిస్ట్రిబ్యూటర్ వంశీని అడుగుతున్నా. ‘క’ సినిమా విజయం నాకు గౌరవాన్ని తీసుకొచ్చింది.
ఇది తమ విజయంగా భావిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతున్నా. ఒక హీరోగా నాకు ఇంతకంటే ఏం కావాలి. సినిమాకు తప్పకుండా సీక్వెల్ చేస్తాం. అది కృష్ణగిరి ఊరి ప్రత్యేకతలతో ఉంటుంది’ అని అన్నారు. ‘ఫస్ట్ టైం డైరెక్టర్స్ అయిన మాకు ‘క’ వంటి బ్లాక్‌బస్టర్ తొలి చిత్రంతోనే దక్కడం చాలా సంతోషంగా ఉంది. ‘క’ ఒక కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. ఇలాంటి స్ర్కిప్ట్‌ను ప్రేక్షకులంతా ఆదరిస్తున్నారు’ దర్శకులు సుజీత్, సందీప్ చెప్పారు. నిర్మాత చింతా గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇంత పెద్ద సూపర్ హిట్ సినిమా తీసింది నేనేనా అని అనిపిస్తోంది. ఇంకా నమ్మకం కుదరడం లేదు. అందుకే సక్సెస్ కిక్ రావడం లేదు’ అని అన్నారు.