ఓ ఫైటర్‌లా పదేళ్ల కెరీర్‌ పూర్తి చేశాడు

ABN, Publish Date - Dec 13 , 2024 | 02:11 AM

’సాయిదుర్గ తేజ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘సంబరాల ఏటిగట్టు’ అనే టైటిల్‌ నిర్ణయించారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన కార్నేజ్‌ లాంచ్‌ ఈవెంట్‌లో వీడియో ద్వారా టైటిల్‌ను ప్రకటించారు...

’సాయిదుర్గ తేజ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘సంబరాల ఏటిగట్టు’ అనే టైటిల్‌ నిర్ణయించారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన కార్నేజ్‌ లాంచ్‌ ఈవెంట్‌లో వీడియో ద్వారా టైటిల్‌ను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న రామ్‌చరణ్‌ మాట్లాడుతూ ‘ఓ ఫైటర్‌లా పదేళ్ల కెరీర్‌ను పూర్తి చేసిన తేజ్‌కి అభినందనలు. అతను మంచి నటుడే కాదు మంచి వ్యక్తి కూడా. తేజ్‌ ఊచకోత ఎలా ఉంటుందో ఈ సినిమాతో చూడబోతున్నారు. ఇంత బడ్జెట్‌ పెట్టి సినిమా తీస్తున్న నిర్మాతలు నిరంజన్‌, చైతన్యలకు అల్‌ ద బెస్ట్‌’ అన్నారు. తను ఈ స్థాయికి రావడానికి కారణమైన ముగ్గురు మావయ్యలకు సాయిదుర్గా తేజ్‌ కృతజ్ఞతలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్‌, టీజీ విశ్వప్రసాద్‌, అనిల్‌ రావిపూడి, మారుతి, ప్రశాంత్‌ వర్మ, వైవీఎస్‌ చౌదరి, దేవ్‌ కట్టా హీరోయిన్‌ ఐశ్వర్య లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రోహిత్‌ కేపీని దర్శకుడిగా పరిచయం చేస్తూ కె.నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 25న విడుదలవుతుంది.

Updated Date - Dec 13 , 2024 | 02:11 AM