మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Harihara Veeramallu : సిద్ధమవుతున్న హరిహర వీరమల్లు

ABN, Publish Date - Jun 02 , 2024 | 02:26 AM

పవన్‌కల్యాణ్‌ తన కెరీర్‌లో తొలిసారిగా చేస్తున్న హిస్టారికల్‌ ఎపిక్‌ వారియర్‌మూవీ ‘హరిహర వీరమల్లు’. 17 వ శతాబ్దంలో పేదల కోసం పోరాడిన యోధుడి పాత్రను ఆయన ఇందులో పోషిస్తున్నారు...

పవన్‌కల్యాణ్‌ తన కెరీర్‌లో తొలిసారిగా చేస్తున్న హిస్టారికల్‌ ఎపిక్‌ వారియర్‌మూవీ ‘హరిహర వీరమల్లు’. 17 వ శతాబ్దంలో పేదల కోసం పోరాడిన యోధుడి పాత్రను ఆయన ఇందులో పోషిస్తున్నారు. క్రిష్‌ జాగర్లమూడి పర్యవేక్షణలో దర్శకుడు జ్యోతికృష్ణ బ్యాలెన్స్‌ షూటింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేయబోతున్నారు. భారీ బడ్జెట్‌తో ఎ.ఎం.రత్నం ఈ సినిమా నిర్మిస్తున్నారు. భారతదేశంలోనే అత్యంత డిమాండ్‌ ఉన్న సినిమాటోగ్రాఫర్‌ మనోజ్‌ పరమహంస ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి వర్క్‌ చేయనున్నారు. త్వరలోనే షూటింగ్‌ను ప్రారంభించే పనిలో నిర్మాత ఉన్నారు. ప్రస్తుతం లొకేషన్ల కోసం రెక్కీ నిర్వహిస్తున్నారు.


ఇప్పటివరకూ షూట్‌ చేసిన సన్నివేశాలకు సంబంధించిన వీఎఫ్‌ఎక్స్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ ను కూడా శరవేగంతో పూర్తి చేస్తున్నారు. ఈ ఏడాది చివరికి ‘హరిహర వీర మల్లు’ పార్ట్‌ వన్‌ ‘స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ను విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్‌, సునీల్‌, నోరా ఫతేహి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Updated Date - Jun 02 , 2024 | 02:26 AM