Hari Hara Veera Mallu: కుందనపు బొమ్మలా నిధి.. పోస్టర్ వైరల్

ABN , Publish Date - Aug 17 , 2024 | 10:11 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరి హర వీర మల్లు’ చిత్రం మళ్లీ లైన్‌లోకి వచ్చింది. ఈ సినిమాపై ఎటువంటి భారీ అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిత్రంతో సినీ ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన విజువల్ ఫీస్ట్ ఇచ్చేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధం అవుతున్నారు. తాజాగా ఈ చిత్ర షూటింగ్ మళ్లీ మొదలైనట్లుగా చెప్పిన మేకర్స్.. నిధి అగర్వాల్ పోస్టర్‌తో బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు.

Niddhi Agerwal Birthday Poster From HHVM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) హీరోగా నటిస్తున్న ‘హరి హర వీర మల్లు’ (Hari Hara Veera Mallu) చిత్రం మళ్లీ లైన్‌లోకి వచ్చింది. ఈ సినిమాపై ఎటువంటి భారీ అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిత్రంతో సినీ ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన విజువల్ ఫీస్ట్ ఇచ్చేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధం అవుతున్నారు. ఇప్పటి వరకు చేయని చారిత్రాత్మక యోధుడు పాత్రలో ఆయన కనువిందు చేయనున్నారు. అణగారిన వర్గాల కోసం పాలకుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడే ఒక యోధుడిగా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. కొంత విరామం తర్వాత ఆగస్ట్ 14 నుంచి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ తిరిగి ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం యాక్షన్ దర్శకుడు స్టంట్ సిల్వ పర్యవేక్షణలో భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఇక ఇప్పుడు చిత్ర బృందం మరో అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న నిధి అగర్వాల్ (Niddhi Agerwal) పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌తో శుభాకాంక్షలు తెలిపింది చిత్ర బృందం. పోస్టర్‌లో నిధి మహాలక్ష్మి దేవి అవతారంగా, బంగారు చీరలో, అద్భుతంగా కనిపిస్తున్న నగలతో మెరుస్తోంది. తనదైన అందంతో ఆమె మాయ చేసేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతోంది. (Happy Birthday Niddhi Agerwal)

Also Read- 70th National Film Awards: ఉత్తమ నటులు, నాయికలు, చిత్రాల విజేతలు వీరే

యువ దర్శకుడు జ్యోతి కృష్ణ (Jyothi Krishna) ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు తీసుకొని, సినీ ప్రేమికులకు, పవన్ కళ్యాణ్ అభిమానులకు వెండితెరపై ఒక అద్భుతమైన అనుభూతిని అందించడానికి రెడీ అవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో బాలీవుడ్ సంచలన నటుడు బాబీ డియోల్, లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్ సహా అనేక మంది ప్రముఖ నటీనటులు కూడా భాగమైన విషయం తెలిసిందే. ప్రముఖ ఛాయగ్రాహకుడు మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, లెజెండరీ కళా దర్శకుడు తోట తరణి ఈ చిత్రం కోసం అద్భుతమైన సెట్‌లను రూపొందిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. (Niddhi Agerwal Birthday Poster From HHVM)


Harihara-Veeramallu.jpg

లెజెండరీ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ‘హరి హర వీర మల్లు’ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ త్వరలో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

Read Latest Cinema News

Updated Date - Aug 17 , 2024 | 10:11 AM

HariHaraVeeramallu: పవన్ కళ్యాణ్ సినిమాలో ఔరంగజేబు, ఎవరో తెలుసా

Harihara Veeramallu : సిద్ధమవుతున్న హరిహర వీరమల్లు

Harihara Veeramallu: ‘హరిహర వీరమల్లు’ టీజర్‌కు టైమ్ ఫిక్సయింది

HariHara Veeramallu : ఆలస్యమైనా విడుదల మాత్రం అలాగే..!

HariHara Veeramallu: వీరమల్లు వీరోచితం.. అదిరిపోయే అప్‌డేట్‌..