HariHaraVeeramallu: పవన్ కళ్యాణ్ సినిమాలో ఔరంగజేబు, ఎవరో తెలుసా
ABN , First Publish Date - 2023-01-08T16:49:09+05:30 IST
పవన్ కళ్యాణ్ ఒక పక్క రాజకీయ సభలు, సమావేశాలు లో పాల్గొంటూనే, ఇంకో పక్క తన సినిమా 'హరి హర వీరమల్లు' (Harihara Veeramallu) కి సమయం కేటాయిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గత కొన్ని రోజులుగా రాత్రి సమయాన్ని సినిమా షూటింగ్ కి కేటాయించినట్టుగా తెలిసింది.
పవన్ కళ్యాణ్ ఒక పక్క రాజకీయ సభలు, సమావేశాలు లో పాల్గొంటూనే, ఇంకో పక్క తన సినిమా 'హరి హర వీరమల్లు' (Harihara Veeramallu) కి సమయం కేటాయిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గత కొన్ని రోజులుగా రాత్రి సమయాన్ని సినిమా షూటింగ్ కి కేటాయించినట్టుగా తెలిసింది. (Pawan Kalyan is busy with political assignments, but he is also providing ample time for his film shoot) ఒక ప్రముఖ స్టూడియో లో సుమారు మూడు కోట్లు పెట్టి ఒక సెట్ ఈ సినిమా కోసం వేసినట్టుగా సమాచారం. దర్శకుడు క్రిష్ (Director Krish) ఈ సినిమాని చాల ప్రతిష్టాత్మకంగా తెరకి ఎక్కిస్తున్నారు. ఎక్కడ రాజీ పడకుండా ఈ సినిమాని తీస్తున్నట్టుగా తెలిసింది. (A big special set erected at a private studio in Hyderabad for this film)
'హరిహర వీరమల్లు' ఒక పీరియడ్ డ్రామా కాబట్టి, దానికి విభిన్నమయిన వాతావరణం ఉండాలి, అందుకని దీనికి ప్రత్యేకంగా సెట్ వేసినట్టుగా తెలిసింది. ఇందులో ముఖ్యమయిన సెట్ ఒకటి మొఘుల్ దర్బార్ ని ప్రతిభింబించేటట్టు ప్రముఖ ఆర్ట్ దర్శకుడు ఆనంద్ సాయి సారధ్యంలో వేసినట్టుగా తెలిసింది. (Art director Anand Sai created a Moghul Durbar) ఇక్కడే షూటింగ్ రాత్రి సమయం లో జరుగుతోందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఈ సన్నివేశాలు ఔరంగజేబు కలం నాటివి అని, ఇందులో ఔరంగజేబు గా ప్రముఖ హిందీ నటుడు బాబీ డియోల్ కనిపించనున్నాడని తెలిసింది. (Aurangzeb role is playing by Bobby Deol) పవన్ కళ్యాణ్, బాబీడియోల్ తో పాటుగా ప్రముఖ హిందీ నటి నర్గిస్ ఫక్రి (Nargis Fakhri) కూడా ఈ సన్నివేశాల్లో పాల్గొందని తెలిసింది. హరి హర వీరమల్లు రాబిన్ హుడ్ (RobinHood) తరహా దొంగ అని, అక్రమంగా సంపాదించిన ధనవంతులను దోచుకొని, పేదలకు పంచటం అతని ధ్యేయం అని, ఈ నేపధ్యం లో కథ ఉంటుందని అంటున్నారు.