Sri Gandhari: హన్సిక ‘శ్రీ గాంధారి’ చిత్ర తెలుగు రైట్స్ ఎవరికంటే..

ABN, Publish Date - Nov 27 , 2024 | 05:48 PM

బబ్లీ బ్యూటీ హన్సిక ఈ మధ్యకాలంలో ఎక్కువగా హారర్ చిత్రాలపైనే ఆసక్తి కనబరుస్తోంది. లేడీ ఓరియంటెడ్ చిత్రాలను సెలక్ట్ చేసుకుంటూ, తన సత్తా చాటుతోన్న హన్సిక త్వరలో ‘శ్రీ గాంధారి’తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్ర తెలుగు రైట్స్‌ని ఎవరు దక్కించుకున్నారంటే..

Hansika in Sri Gandhari

ఈ మధ్యకాలంలో బబ్లీ బ్యూటీ హన్సిక (Hansika Motwani) ఎక్కువగా హారర్ చిత్రాలపైనే ఆసక్తి కనబరుస్తోంది. హారర్ చిత్రాలపై ఆడియెన్స్‌కి ఎప్పుడూ కొన్ని అంచనాలుంటాయి. నవ్విస్తూ.. భయపెట్టే చిత్రాలు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఇష్టపడతారు. అందుకే హన్సిక ఈ జానర్ చిత్రాలకు ఎక్కువగా మొగ్గుచూపుతున్నట్లుగా అనిపిస్తోంది. ఈ మధ్య ఆమె చేసిన చిత్రాల మాదిరిగానే ఇప్పుడు మరో సినిమాతో హన్సిక భయపెట్టేందుకు రెడీ అవుతోంది. ‘శ్రీ గాంధారి’ (Sri Gandhari) టైటిల్‌తో మసాలా పిక్స్ బ్యానర్‌పై ఆర్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర తెలుగు రైట్స్‌ను ఫ్యాన్సీ రేటుకు సరస్వతి డెవలపర్స్‌తో కలిసి లచ్చురం ప్రొడక్షన్స్ బ్యానర్‌ నిర్మాత రాజు నాయక్ సొంతం చేసుకున్నారు. ఈ మూవీని వీకేఆర్ (విక్రమ్ కుమార్ రెజింతల) సమర్పిస్తున్నారు.

Also Read-Akkineni Family: ఒకవైపు నాగచైతన్య పెళ్లి.. మరో వైపు అఖిల్ నిశ్చితార్థం

హిందూ ట్రస్ట్ కమిటీకి హెడ్ ఆఫీసర్‌గా పనిచేసే యువతిగా ఇందులో హన్సిక నటించారు. ఆమె ‘గంధర్వ కోట’ పురాతన స్మారకానికి సంబంధించిన పరిశోధన ప్రాజెక్ట్‌ను చేపట్టడంతో అసలు కథ మొదలవుతుంది. ఒక రాజు నిర్మించిన శతాబ్దాల నాటి ఈ కోటలో ఎన్నో రహస్యాలుంటాయి. ఆ రహస్యాల్ని ఎలా బయటకు తీసుకు వచ్చారు? అనేది క్లుప్తంగా ‘శ్రీ గాంధారి’ కథ. ఈ మేరకు ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను ఏర్పరచిన విషయం తెలిసిందే.


ఈ ట్రైలర్‌లో హన్సిక లుక్స్, యాక్టింగ్ చాలా కొత్తగా అనిపించాయి. ఇతర నటీనటుల లుక్స్, వేరే భాషల్లో చెప్పిన డైలాగ్స్ అన్నీ కూడా సినిమాపై ఆసక్తి రేకెత్తించేలా ఉన్నాయి. ఈ చిత్రంలో మెట్రో శిరీష్, మయిల్‌సామి, తలైవాసల్ విజయ్, ఆడుకాలం నరేన్, స్టంట్ సిల్వా, వినోదిని, పవన్, బ్రిగిడా సాగా, వడివేల్ మురుగన్, కలైరాణి వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ‘శ్రీ గాంధారి’ చిత్రానికి కథను తొల్కప్పియన్, స్క్రీన్‌ప్లేని ధనంజయన్ అందించగా.. బాల సుబ్రమణియన్ సినిమాటోగ్రాఫర్‌గా, ఎల్వీ గణేష్ ముత్తు మ్యూజిక్ కంపోజర్‌గా, జిజింత్ర ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. మిస్టరీ, సస్పెన్స్, హారర్, థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ ‘శ్రీ గాంధారి’ చిత్రాన్ని డిసెంబర్‌లో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు రాజు నాయక్ సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిపారు.

Also Read-Pawan Kalyan: రామ్ గోపాల్ వర్మ అరెస్ట్‌కై.. నేను చేయాల్సింది చేస్తా..

Also Read-Samantha Fire: విడాకులు తీసుకుంటే.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 27 , 2024 | 05:48 PM