గురుదక్షిణగా రూ. 300

ABN, Publish Date - Aug 14 , 2024 | 02:58 AM

ఖరీదైన బహుమతులే అవ్వాల్సిన పనిలేదు... మనసు అంతరాళలో నుంచి పొంగిపొర్లే ప్రేమను వ్యక్త పరిచేందుకు ఇచ్చే బహుమతులు చిన్నవే అయినా వాటి విలువ అమూల్యమే. సీనియర్‌ బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌...

ఖరీదైన బహుమతులే అవ్వాల్సిన పనిలేదు... మనసు అంతరాళలో నుంచి పొంగిపొర్లే ప్రేమను వ్యక్త పరిచేందుకు ఇచ్చే బహుమతులు చిన్నవే అయినా వాటి విలువ అమూల్యమే. సీనియర్‌ బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ తను గురువుగా భావించే మహేశ్‌భట్‌కు కూడా ఇలాంటి బహుమతినే అందించి, ఆశ్చర్యపరిచారు. ఇటీవలే ముంబైలో జరిగిన ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో మహేశ్‌భట్‌, అనుపమ్‌ఖేర్‌ వేదికను పంచుకున్నారు. తన సినీ ప్రయాణం గురించి వేదికపైన మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు అనుపమ్‌ఖేర్‌. ‘ఎవరైనా నా బయోపిక్‌తీస్తే అందులో భట్‌ సాబ్‌ది ముఖ్యమైన పాత్ర అవుతుంద’ని ఆయన అన్నారు. అలా చెబుతూ వెంటనే తన జేబులో నుంచి రూ. 300 తీసి మహేశ్‌భట్‌కు అందజేసి, గురుదక్షిణగా స్వీకరించాలని కోరారు. మహేశ్‌భట్‌ ఆ నోట్లను సంతోషంగా స్వీకరించడమే గాకుండా వాటిని వేదికపైనుంచి అందరికీ చూపించి, జాగ్రత్తగా తన జేబులో దాచుకున్నారు.


అనుపమ్‌ఖేర్‌ సినీ జీవితాన్ని మలుపుతిప్పిన చిత్రం ‘సారాంశ్‌’. నటుడిగా ఆయనకు గొప్ప పేరు తెచ్చి కెరీర్‌లో నిలదొక్కుకునేలా చేసింది. 1984లో వచ్చిన ఈ చిత్రానికి మహేశ్‌భట్‌ దర్శకత్వం వహించారు.

Updated Date - Aug 14 , 2024 | 02:58 AM