40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘గుంటూరు కారం’‌పై విమర్శలు చేస్తుంది వాళ్లే: ‘కృష్ణ విజయం’ వేడుకలో ఆలిండియా కృష్ణ-మహేష్ ఫ్యాన్స్

ABN, Publish Date - Jan 14 , 2024 | 06:56 PM

సూపర్ స్టార్ కృష్ణ నటించిన చివరి చిత్రం ‘కృష్ణ విజయం’. అంబుజా మూవీస్ పతాకంపై మధుసూదన్ హవల్దార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ పనులు జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ సెన్సేషన్ ‘గుంటూరు కారం’ సక్సెస్ కేక్‌ని కట్ చేసి.. నెగిటివ్ ప్రచారం చేస్తున్న వారిపై ఆలిండియా కృష్ణ -మహేష్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు.

Krishna Vijayam Pre Release Event

సూపర్ స్టార్ కృష్ణ నటించిన చివరి చిత్రం ‘కృష్ణ విజయం’ (Krishna Vijayam). అంబుజా మూవీస్ పతాకంపై మధుసూదన్ హవల్దార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ పనులు జరుపుకుంటోంది. నాగబాబు, సుహాసిని, యశ్వంత్, అలీ, సూర్య, గీతాసింగ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. త్వరలో విడుదల కానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఆలిండియా కృష్ణ -మహేష్ సేన (All India Krishna and Mahesh Sena) అధ్యక్షులు ఖాదర్ ఘోరి, పద్మాలయ శర్మ, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సాధిస్తున్న సంచలన విజయాన్ని పురస్కరించుకుని సక్సెస్ కేక్ కట్ చేశారు. ‘గుంటూరు కారం’ సాధిస్తున్న రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ చూసి ఓర్వలేక కొందరు కావాలని కువిమర్శలు చేస్తున్నారని, వాటిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆలిండియా కృష్ణ -మహేష్ సేన అధ్యక్షులు ఖాదర్ ఘోరి అన్నారు. సినిమా బాగా లేకపోతే ఆ విషయాన్ని తమ హీరో కృష్ణగారే ముందుగా చెప్పేసేవారని, ఆ లక్షణం మహేష్ బాబులోనూ ఉందని, కానీ... ఫ్యాన్స్‌తో పాటు అందరూ ఆస్వాదిస్తున్న ‘గుంటూరు కారం’ గురించి ఘోరంగా మాట్లాడడం సరి కాదని వారు హితవు పలికారు.


‘కృష్ణ విజయం’ ప్రీ రిలీజ్ వేడుకలో ‘గుంటూరు కారం’ సక్సెస్ సెలబ్రేషన్స్ జరగడం సూపర్ స్టార్ కృష్ణ గారికి మనమిచ్చే గొప్ప నివాళిగా భావిస్తున్నానని పేర్కొన్న ‘కృష్ణ విజయం’ దర్శకులు మధుసూదన్ హవల్దార్... కృష్ణ ఫ్యాన్స్ అభిప్రాయంతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు దర్శకులు ముప్పలనేని శివ, సంజీవ్ కుమార్ మేగోటి, దర్శకనిర్మాత లయన్ సాయి వెంకట్.. నిర్మాతలు ఎస్.వి. శోభారాణి, జె.వి.మోహన్ గౌడ్, గిడుగు క్రాంతి కృష్ణ, బిజినెస్ కో ఆర్డినేటర్ నారాయణ, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ తదితరులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Teja Sajja: ‘హను-మాన్’ విడుదల తర్వాత మెగాస్టార్ ఏమని మెసేజ్ చేశారంటే..

***************************

*Extra Ordinary Man: ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ ఓటీటీలోకి వచ్చే డేట్ ఫిక్స్

**************************

*Guntur Kaaram: రెండో రోజూ రమణగాడు రాంప్ ఆడేశాడు.. రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

****************************

*నిర్మాత వివేక్ కూచిభొట్ల‌ను బెదిరిస్తోన్న సినీ రచయితపై కేసు నమోదు

************************

Updated Date - Jan 14 , 2024 | 06:56 PM