మేకప్ కోసం నాలుగున్నర గంటలు
ABN, Publish Date - Oct 02 , 2024 | 12:36 AM
‘శ్వాగ్’ ఒక వంశానికి సంబంధించిన కథ మాత్రమే కాదు పితృస్వామ్యం అనే క్లాష్ నుంచి 15వ శతాబ్దంలో మొదలయ్యే కథ కూడా. స్ర్తీ, పురుషుల్లో ఎవరు గొప్ప అనే అంశంపై చర్చించే...
‘శ్వాగ్’ ఒక వంశానికి సంబంధించిన కథ మాత్రమే కాదు పితృస్వామ్యం అనే క్లాష్ నుంచి 15వ శతాబ్దంలో మొదలయ్యే కథ కూడా. స్ర్తీ, పురుషుల్లో ఎవరు గొప్ప అనే అంశంపై చర్చించే ఆసక్తికరమైన కథ. కొత్త కథలు ఎప్పుడు వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారనే ధైర్యంతో ఈ సినిమా చేశాం’ అన్నారు శ్రీవిష్ణు. ఆయన హీరోగా నటించిన ‘శ్వాగ్’ చిత్రం ఈ నెల నాలుగున విడుదలవుతున్న నేపథ్యంలో మీడియాకు చిత్ర విశేషాలు వెల్లడించారు.
నేనెప్పుడూ డ్యూయెల్ రోల్స్ వేయలేదు. కానీ ఇందులో నాలుగు పాత్రలు పోషించాను. అందరూ ఒకే పోలికలతో ఉండే ఒకే వంశస్తులు. ఎలా చేయాలన్నది సవాల్‌గా అనిపించింది. గెటప్ప్ అన్నీ సెట్ అయ్యాక నమ్మకం కుదిరింది.. ఈ నాలుగు పాత్రల్లో సింగ పాత్ర కొంచెం ఈజీ అనిపించింది. మిగతా మూడూ కష్టమైనవే. రోజూ నాలుగున్నర గంటల సేపు మేకప్ చేసుకోవడం, దాన్ని తీయడానికి మరో రెండు గంటలు పట్టడం.. చాలా టఫ్. అయితే టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత ఆ కష్టాన్ని మరిచిపోయా.
చాలా పెద్ద కథ ఇది. దీన్ని రెండున్నర గంటల్లో చెప్పారా అని సినిమా చూశాక ప్రేక్షకులు దర్శకుడు హసిత్ గోలిని అభినందిస్తారు. కథలో భాగంగానే ఉండే వినోదం అందరినీ అలరిస్తుంది. నా కెరీర్‌లో వన్ ఆఫ్ ద టాప్ ఫిల్మ్‌గా నిలుస్తుందనే నమ్మకం ఉంది.
సినిమాలో క్యారెకర్ బ్యాక్ స్టోరీస్ బాగా కుదిరాయి. రీతూ వర్మ పాత్రలో మంచి ట్రాన్స్‌ఫర్మేషన్ ఉంటుంది. ఈ సినిమా చూశాక మహిళల్ని ఎక్కువ అభిమానిస్తాం. గౌరవిస్తాం.
ఒక థ్రిల్లర్ చేస్తున్నాను. అలాగే గీతా ఆర్ట్స్‌లో ఓ మంచి ఎంటర్ టైనర్ చేస్తున్నాను.