మహిళలకు మాత్రమే

ABN, Publish Date - Aug 25 , 2024 | 04:54 AM

నూతన నటీనటులతో తెరకెక్కిన చిత్రం ‘ఎంత పనిచేశావ్‌ చంటి’. ఉదయ్‌ కుమార్‌ దర్శకత్వంలో లడ్డే బ్రదర్స్‌ నిర్మించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది...

నూతన నటీనటులతో తెరకెక్కిన చిత్రం ‘ఎంత పనిచేశావ్‌ చంటి’. ఉదయ్‌ కుమార్‌ దర్శకత్వంలో లడ్డే బ్రదర్స్‌ నిర్మించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ విడుదల కార్యక్రమాన్ని యూనిట్‌ నిర్వహించింది. దర్శకుడు నక్కిన త్రినాథరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దర్శకుడు మాట్లాడుతూ ‘విభిన్న కథతో ‘ఎంత పనిచేశావ్‌ చంటి’ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ సినిమాను మగవాళ్లు చూడకూడదు. మహిళలు మాత్రమే చూడాలి’ అని అన్నారు. శ్రీనివా్‌సఉలిశెట్టి, దియారాజ్‌, నిహారిక శాంతిప్రియ జంటగా నటించారు. సంగీతం: పవన్‌ సినిమాటోగ్రఫీ: సంతోష్‌.

Updated Date - Aug 25 , 2024 | 04:54 AM