కోహినూర్ వజ్రం కోసం...
ABN, Publish Date - Oct 15 , 2024 | 12:15 AM
‘క్షణం’ ఫేమ్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ ఓ చిత్రంలో నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ సంస్థతో ఇప్పటికే ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ వంటి...
‘క్షణం’ ఫేమ్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ ఓ చిత్రంలో నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ సంస్థతో ఇప్పటికే ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలలో నటించారాయన. తాజాగా, ఈ సినిమాకు ‘కోహినూర్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ ‘‘కోహినూర్’ వజ్రాన్ని తిరిగి భారత్‌కు తీసుకురావడమే కథాంశంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను 2026లో విడుదల చేయనున్నాం. ఈ చిత్రం ఘనవిజయం సాధించి.. సిద్ధుకూ, మాకు హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తుంది’’ అని అన్నారు. కాగా, రవికాంత్ పేరేపు దర్శకత్వంలో ఇంతకుముందు ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రంలో నటించారు సిద్ధు జొన్నలగడ్డ.