యాభై సెకన్ల యాడ్‌కు రూ. ఐదు కోట్లా!?
ABN, Publish Date - Sep 27 , 2024 | 02:19 AM
కాలం కలసి రావాలే కానీ సినిమా తారలకు ఇప్పుడు రెండు చేతులా సంపాదనే!. అయితే సినిమా షూటింగ్ లేకపోతే యాడ్ షూటింగ్ అన్నట్లుగా ఉంది కొంతమంది తారల బిజీ షెడ్యూల్. రెండు చోట్లా మంచి డబ్బు వస్తుండడంతో మరింత హుషారుగా పని చేస్తున్నారు...
కాలం కలసి రావాలే కానీ సినిమా తారలకు ఇప్పుడు రెండు చేతులా సంపాదనే!. అయితే సినిమా షూటింగ్ లేకపోతే యాడ్ షూటింగ్ అన్నట్లుగా ఉంది కొంతమంది తారల బిజీ షెడ్యూల్. రెండు చోట్లా మంచి డబ్బు వస్తుండడంతో మరింత హుషారుగా పని చేస్తున్నారు. ఒక సినిమా కోసం మూడు, నాలుగు నెలలు కష్టపడితే వచ్చే పారితోషికం కంటే ఒక నిముషం పాటు కనిపించే యాడ్ ఫిల్మ్ సంపాదనే ఎక్కువగా ఉండడంతో తెలుగులోనూ చాలా మంది తారలు ఇప్పుడు యాడ్ ఫిల్మ్స్‌లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందరికంటే ఒక అడుగు ముందుకు వేసి యాభై సెకన్ల యాడ్ ఫిల్మ్ లో నటించినందుకు అక్షరాలా రూ. ఐదు కోట్లు వసూలు చేసి వార్తల్లో నిలిచారు నయనతార. ఇంతకుముందు నయనతార పారితోషికం రూ. ఐదు కోట్లే ఉండేది. కానీ హిందీ చిత్రం ‘జవాన్’ సూపర్ హిట్ అయిన తర్వాత అమాంతం తన పారితోషికాన్ని పది కోట్ల రూపాయలకు నయనతార పెంచేసిందని నిర్మాతలు చెబుతున్నారు.
అంటే సౌత్‌లో నే అత్యధిక పారితోషికం తీసుకొనే హీరోయిన్ నయనతారే అన్నమాట. ఇప్పుడు యాడ్ ఫిల్మ్స్ తోనూ ఆమె మోత మోగిస్తోంది. ప్రస్తుతం నయనతార తన భర్త విఘ్నేశ్, కవల పిల్లలతో గ్రీస్‌లో జాలీగా విహరిస్తోంది.