కేరళలో ముగించారు
ABN, Publish Date - Sep 26 , 2024 | 01:13 AM
శర్వానంద్ కథానాయకుడిగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం (‘శర్వా 37’- వర్కింగ్ టైటిల్) కీలక షెడ్యూల్ పూర్తయింది. పది రోజుల పాటు కేరళలో జరిగిన షెడ్యూల్‌లో...
శర్వానంద్ కథానాయకుడిగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం (‘శర్వా 37’- వర్కింగ్ టైటిల్) కీలక షెడ్యూల్ పూర్తయింది. పది రోజుల పాటు కేరళలో జరిగిన షెడ్యూల్‌లో పాట, ఫైట్ సీక్వెన్స్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ చిత్రంలో శర్వానంద్‌కు జంటగా సాక్షి వైద్య, సంయుక్త నటిస్తున్నారు. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్ వీఎస్