యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ
ABN, Publish Date - Nov 29 , 2024 | 06:07 AM
హీరో నాగశౌర్య తన నూతన చిత్రాన్ని రామ్ దేశిన దర్శకత్వంలో చేస్తున్నారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బేనర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. తాజాగా...
హీరో నాగశౌర్య తన నూతన చిత్రాన్ని రామ్ దేశిన దర్శకత్వంలో చేస్తున్నారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బేనర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ షూటింగ్‌లో యాక్షన్ సీక్వెన్స్‌ని చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలో టైటిల్, ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రానికి హరీస్ జైరాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. సముద్రఖని, రాజేంద్ర ప్రసాద్, సాయికుమార్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్‌కుమార్, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, పృథ్వీ, అజయ్, ప్రియ, నెల్లూరు సుదర్శన్, కృష్ణుడు, చమక్ చంద్ర, శివన్నారాయణ నటిస్తున్నారు.