మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chandrababu Naidu swearing in: చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవానికి తరలివచ్చిన తారా లోకం

ABN, Publish Date - Jun 12 , 2024 | 11:03 AM

ఒక పక్క మెగా స్టార్ చిరంజీవి, ఇంకో పక్క తలైవర్ రజినీకాంత్, ఇంకో పక్క శివాజీ, నిఖిల్, నారా రోహిత్ ఇలా చాలామంది నటులు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చెయ్యబోయే ఉత్సవానికి హాజరయ్యారు.

Rajinikanth and Chiranjeevi at the swearing in ceremony of Nara Chandrababu Naidu

కేసరవల్లిలో కొద్ధి నిముషాలలో నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ పండగ చూడటానికి అశేష జనవాహిని తరలివచ్చింది. సభాప్రాంగణం అంతా జనంతో కిక్కిరిసిపోతోంది. సాంస్కృతిక నృత్యాలు, జానపద గేయాలతో సభా ప్రాంగణం మారుమోగుతోంది. అలాగే సినీ పరిశ్రమ నుండి కూడా ఎంతోమంది నటీనటులు ఈ ప్రమాణ స్వీకార మోహోత్సవానికి విచ్చేస్తున్నారు.

చంద్రబాబు తమ్ముని కుమారుడు, నటుడు నారా రోహిత్ ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. అలాగే ప్రముఖ నటుడు, తెలుగు దేశం వాణి వేడిగా వినిపించిన నటుడు శివాజీ కూడా ప్రత్యేక అతిధిగా విచ్చేసారు. నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర, నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సినీ నటుడు నందమూరి చైతన్య కృష్ణ కూడా విచ్చేసారు.

ప్రముఖ నిర్మాత, మహేష్ బాబు చిన్నాన్న ఘట్టమనేని ఆదిశేషగిరి రావు ప్రత్యేక అతిధిగా ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసారు. నిన్ననే అగ్ర నటుడు, మెగా స్టార్ చిరంజీవి తన కుటుంబ సభ్యులతో ప్రత్యేక విమానంలో హైదరాబాదు నుండి విజయవాడ చేరుకున్న సంగతి తెలిసిందే. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తన భార్య లతతో హాజరయ్యారు. యువ నటుడు నిఖిల్ కూడా ఈ ఉత్సవానికి ప్రత్యేక అతిధిగా హాజరవుతున్న సంగతి కూడా తెలిసిందే.

ఒక పక్క రాజకీయ నాయకులతో, ఇంకో పక్క చిత్ర పరిశ్రమకి చెందిన నటీనటులతో సభా ప్రాంగణం మెరిసిపోతోంది. ఇదే వేడుకలో అగ్ర నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Updated Date - Jun 12 , 2024 | 11:11 AM