ధైర్యాన్ని నింపింది
ABN, Publish Date - Aug 14 , 2024 | 02:55 AM
నటుడిగా తొలి చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కృష్ణవంశీ. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌తో నడుస్తోంది....
నటుడిగా తొలి చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కృష్ణవంశీ. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌తో నడుస్తోంది. ఈ సందర్భంగా కృష్ణవంశీ మీడియాతో ముచ్చటించారు. ‘‘నా తొలి సినిమాకే ఇంతటి ప్రేక్షకాదరణ దక్కడం చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత ఓ స్వచ్చమైన ప్రేమకథను థియేటర్లలో చూశామని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ఈ విజయం టీమ్ అందరిలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది’’ అని చెప్పారు.