ఆడ లేడీస్‌ వర్సెస్‌ మగ జెంట్స్‌

ABN, Publish Date - Sep 04 , 2024 | 03:26 AM

శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘శ్వాగ్‌’ చిత్రం విడుదల తేదీ ప్రకటించారు. హసిత్‌ గోలీ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమా దసరా పండగకు పది రోజుల ముందే అంటే అక్టోబర్‌ 4న...

శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘శ్వాగ్‌’ చిత్రం విడుదల తేదీ ప్రకటించారు. హసిత్‌ గోలీ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమా దసరా పండగకు పది రోజుల ముందే అంటే అక్టోబర్‌ 4న విడుదల కానుంది. ఈ సినిమాతో శ్రీవిష్ణు మరో విభిన్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన సరసన రీతూ వర్మ నటించారు. సినిమాలో ఆడ లేడీస్‌, మగ జెంట్స్‌ మధ్య ఉండే ఆసక్తికరమైన కంటెంట్‌ అలరిస్తుందని శ్రీవిష్ణు, రీతూ వర్మ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు.మీరా జాస్మిన్‌, సునీల్‌, దక్ష నగర్కార్‌ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

Updated Date - Sep 04 , 2024 | 03:26 AM