శరవేగంగా చిత్రీకరణ

ABN, Publish Date - Dec 16 , 2024 | 04:46 AM

స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌ రామ్‌ జీవిత విశేషాల ఆధారంగా దిలీప్‌ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘బాబు జగ్జీవన్‌ రామ్‌’. ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ ప్రదీప్‌ దోనెపూడి...

స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌ రామ్‌ జీవిత విశేషాల ఆధారంగా దిలీప్‌ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘బాబు జగ్జీవన్‌ రామ్‌’. ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ ప్రదీప్‌ దోనెపూడి. బాబు జగ్జీవన్‌ రామ్‌ పాత్రలో మిలటరీ ప్రసాద్‌ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్‌ ఫిల్మ్‌ఛాంబర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో చిత్రబృందం షూటింగ్‌ వివరాలను వివరించింది. చిత్రదర్శకుడు దిలీప్‌ రాజా మాట్లాడుతూ ‘జగ్జీవన్‌ రామ్‌ సేవల గురించి ప్రేక్షకులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. జగ్జీవన్‌రామ్‌ వర్ధంతి అయిన జూలై 6న విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నాం’ అని అన్నారు.

Updated Date - Dec 16 , 2024 | 04:46 AM