అంచనాలను మించేలా...

ABN, Publish Date - Oct 14 , 2024 | 02:05 AM

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘విశ్వంభర’. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. త్రిష, ఆషికా రంగనాథ్‌, కునాల్‌ కపూర్‌ కీలక పాత్రలు...

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘విశ్వంభర’. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. త్రిష, ఆషికా రంగనాథ్‌, కునాల్‌ కపూర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు వశిష్ట మాట్లాడుతూ ‘‘సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తయ్యింది. మీ అందరి అంచనాలను మించేలా సినిమా ఉంటుంది. చిరంజీవితో సినిమా చేయడం మరిచిపోలేని అనుభూతి’’ అని చెప్పారు.

Updated Date - Oct 14 , 2024 | 02:05 AM