అంతా మంచే జరుగుతుంది
ABN, Publish Date - Dec 20 , 2024 | 02:10 AM
‘ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. నా అభిమానులు, సహ నటీనటుల ప్రేమ, ఆదరాభిమానాలు పొందుతున్నందుకు సంతోషంగా ఉంది. నా అనారోగ్య విషయాన్ని గతంలోనే...
‘ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. నా అభిమానులు, సహ నటీనటుల ప్రేమ, ఆదరాభిమానాలు పొందుతున్నందుకు సంతోషంగా ఉంది. నా అనారోగ్య విషయాన్ని గతంలోనే వెల్లడించాను. ఈ విషయంలో సంయమనం పాటించిన మీడియాకు ధన్యవాదాలు. సర్జరీ కోసం వెళ్తున్నప్పుడు ఎవరికైనా కాస్త ఆందోళనకరంగానే ఉంటుంది’ అని అన్నారు కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్. కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న శివరాజ్‌కుమార్ శస్త్ర చికిత్స కోసం అమెరికా వెళ్లారు. ఈనెల 24న ఆయనకు సర్జరీ జరగనుంది. ఎయిర్‌పోర్టు వద్ద మీడియాతో శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ ‘ఇలాంటి సమయంలో అభిమానులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులను చూసినప్పుడు కాస్త ఎమోషనల్‌గా ఫీల్ అవుతాం. అంతా మంచే జరుగుతుంది. ఎవరూ ఆందోళన చెందకండి. సర్జరీ పూర్తయ్యాక యూఐ, మ్యాక్స్ సినిమాలను తప్పకుండా చూస్తాను’ అని అన్నారు.