అందరికీ నచ్చుతుంది

ABN, Publish Date - Dec 16 , 2024 | 04:44 AM

కేవీజీ రాజు దర్శకత్వంలో లోకేశ్‌ బాబు దాసరి, శిరీష హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ఉల్లాసంగానే ఉత్సాహంగానే’. శ్రీ మైత్రీ క్రియేషన్స్‌ పతాకంపై యార్లగడ్డ ఉమామహేశ్వరరావు నిర్మిస్తున్నారు...

కేవీజీ రాజు దర్శకత్వంలో లోకేశ్‌ బాబు దాసరి, శిరీష హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ఉల్లాసంగానే ఉత్సాహంగానే’. శ్రీ మైత్రీ క్రియేషన్స్‌ పతాకంపై యార్లగడ్డ ఉమామహేశ్వరరావు నిర్మిస్తున్నారు. ఎండీ కలామ్‌, ఖదీర్‌ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు కేవీజీ రాజు మాట్లాడుతూ‘ ఈ చిత్రంలో లోకేశ్‌ ఎనర్జిటిక్‌గా నటించాడు. త్వరలో సాంగ్స్‌, ట్రైలర్‌ రిలీజ్‌ చేస్తాం’ అని తెలిపారు. నిర్మాత ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ‘ ఒక మంచి లవ్‌ స్టోరీని తెరకెక్కించాం. మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా’ అని అన్నారు.

Updated Date - Dec 16 , 2024 | 04:44 AM